Pages

Varalakshmi Vrata Vidhanam

Varalakshmi Vrata Vidhanam
Varalakshmi Vrata Vidhanam
How to Perform Varalakshmi Vratam? Performing Varalakshmi Vratam, Process of Varalakshmi Puja, Varalakshmi Vratakalpam

వరలక్ష్మీ వ్రతము  

వరలక్ష్మి వ్రతం కోసం సిద్ధం చేసుకోవలసిన వస్తువులు
  • సాంబ్రాణి, అగరుబత్తి, దీపపు కుందులు, అగ్గిపెట్టె, ఆవు నెయ్యి, దీపపు వత్తులు, పసుపుతో కలిపినా అక్షతలు, పసుపు, కుంకుమ, పువ్వులు, గంధం, హారతి కర్పూరం, పళ్ళు, కొబ్బరికాయలు
  • తోరములు - దారమును తొమ్మిది వరుసలుగా తీసి పసుపు రాసి తొమ్మిది చోట్ల పువ్వులతో తొమ్మిది ముడులు వేసి ఉంచినవి.
  • నివేదనకు, స్త్రీ దేవతారాధనకు బియ్యం పిండి మరియు బెల్లంతో చేసిన చలిమిడి, అందుబాటులో లేకపోతె ఏవైనా స్వీట్లు
  • పానకం - శుద్ధమైన నీటిలో బెల్లం పొడి, ఏలక్కాయల పొడి, మిరియాలపొడి కొద్దిగా కలిపితే తయారవుతుంది.
  • నైవేద్యం 
గణపతిపూజ 

ఓం శ్రిగురుభ్యోన్నమః,
మహాగాణాదిపతయే నమః,
శ్రీ వరలక్ష్మిదెవ్యై నమః  నమః. హరిహిఓమ్,

దేవీంవాచ మజనయంత దే వాస్తాం విశ్వరూపాః పశవోవదంతి!

సానోమంద్రేష మూర్జం దుహానా దేనుర్వాగస్మా నుపసుష్టుతైతు|
అయంముహూర్త సుముహూర్తోఅస్తూ||

యశ్శివో నామ రూపాభ్యాం యాదేవి సర్వమంగళా!
తయోసంస్మరనాత్పుమ్సాం సర్వతో జయమంగళం||

శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం|
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే||

తదేవలగ్నం సుదినంతదేవా తారాబలం చంద్రబాలన్తదేవ!
విద్యాబలం దైవబలన్తదేవ లక్ష్మిపతే తేంఘ్రియుగంస్మరామి||

యత్రయోగీశావర కృష్ణో యత్రపార్దో ధనుద్దరః|
తత్ర శ్రీ విజయోర్భూతి ద్రువానీతిర్మతిర్మమ||

స్మృతే సకలకల్యాణి భాజనం యత్రజాయతే|
పురుషస్తమజంనిత్యం వ్రాజామిస్హరణం హరిం||

సర్వదా సర్వ కార్యేషు నాస్తితెశామ మంగళం|
యేషాంహ్రుదిస్తో భగవాన్ మంగళాయతనం హరిం|
లాభాస్తేశాం జయస్తేషాం కుతత్తేషాం పరాభవః||

యేశామింది వరష్యామో హృదయస్తో జనార్దనః|
ఆపదామప హర్తారం దాతారం సర్వసంపదాం|
లోకాభిరామం శ్రీ రామం భూయోభూయోనమామ్యాహం||

సర్వమంగళ మాంగల్యే శివేసర్వార్ధసాదికే|
శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే||

శ్రీ లక్ష్మి నారాయనాభ్యాం నమః|
ఉమా మహేశ్వరాభ్యాం నమః|
వాణీ హిరణ్య గర్భాభ్యాం నమః|
శాచీపురంధరాభ్యాం నమః|
అరుంధతి వశిష్టాభ్యాం నమః|
శ్రీ సీతారామాభ్యాం నమః|
సర్వేభ్యోమహాజనేభ్యో నమః|

ఆచ్యమ్య: 

ఓం కేశవాయ స్వాహాః, నారాయణాయ స్వాహాః, మాధవాయ స్వాహాః

గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, హృషీకేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్దాయ నమః, పురుషోత్తమాయ నమః, అధోక్షజాయ నమః, ,నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీ కృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః

ప్రాణాయామము:

ఉత్తిష్టంతు భూతపిశాచాః ఏతే భూమిభారకాః ఏతేషాం అవిరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఓంభూః ఓం భువః ఓగుం సువః, ఓం మహః ఓంజనః ఓంతపః ఓగుం సత్యం ఓంతత్స వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్.

ఓమాపోజ్యో తీరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం. మమోపాత్త దురితక్షయద్వారా శ్రీపరమేశ్వర వుద్దిస్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీమహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య ఆద్యబ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరత వర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన సంవత్సరము పేరు .......... సంవత్సరే, .......ఆయనే, ....... మాసే, .......పక్షే, ......తిది, ........వాసరే శుభయోగే శుభకరణ ఏవంగుణ విశేషణ, విశిష్టాయాం, శుభతిథౌ శ్రీమాన్ ... గోత్రః ...నామధేయః (ధర్మ పత్నీ సమేతః) మమ ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిధ్యర్థం, పుత్రపౌత్రాభివృద్ధ్యర్థం, సర్వాభీష్ట సిద్ధ్యర్థం, మహా గణాధిపతి ప్రీత్యర్థం ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే, తదంగ కలశారాధనం కరిష్యే.

కలశారాధన:

(కలశమునకు గంధము, కుంకుమబొట్లు పెట్టి, ఒక పుష్పం, కొద్దిగా అక్షతలువేసి, కుడిచేతితో కలశమును మూసి ఈ క్రింది మంత్రమును చెప్పవలెను).

శ్లో.. కలశస్యముఖేవిష్ణుః కంఠేరుద్ర సమాశిత్రాః మూలేతత్రస్థితో బ్రహ్మమధ్యే మాతృగణాస్మృతాః
కుక్షౌతు సాగరాసర్వే సప్తద్వీపోవసుంధరా ఋగ్వేదోథ యజుర్వేద స్సామవేదో హ్యదర్వణః
అంగైశ్చ సహితాసర్వే కలశౌంబుసమాశ్రితాః ఆయాంతు శ్రీవరలక్ష్మి పూజార్ధం దురితక్షయ కారకాః

మం: ఆ కలశే
షుధావతే పవిత్రే పరిశిచ్యతే

ఉక్థైర్యజ్ఞేషు వర్ధతే, ఆపోవా ఇదగుం సర్వం

విశ్వా భూతాన్యాపః ప్రాణావాఆపః పశవ ఆపోన్నమాపోమ్రుతమాపః
సమ్రాడాపోవిరాడాప స్వరాదాపః చందాగుశ్యాపో జ్యోతీగుష్యాపో యజోగుష్యాప

సత్యమాపస్సర్వా దేవతాపో భూర్భువస్సువరాప ఓం.

 శ్లో.. గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతి
నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింకురు ఏవం కలశపూజాః
కలశోదకాని పూజాద్రవ్యాణి సంప్రోక్ష, దేవంసంప్రోక్ష, ఆత్మానం సంప్రోక్ష (అని పఠించి ఆ నీటిని దేవునిపై, పూజాద్రవ్యములపై, తమపై అంతటా చల్లవలెను.)

ప్రాణప్రతిష్ఠ:

మం: ఓం అసునీతే పునరస్మాసు  చక్షు పునః ప్రాణామిహనో దేహిభోగం|
జోక్పస్యేమ  సూర్యముచ్చరంతా మృళయానా స్వస్తి||
 అమ్రుతంవై ప్రాణా అమ్రుతమాపః ప్రానానేవయదా స్థాన ముపహ్వాయతే||
స్తిరోభవ| వరదోభవ| సుముఖోభవ| సుప్రసన్నోభవ| స్తిరాసనంకురు 

ధ్యానం:  

మం: ఓం గణానాంత్వా గణపతిగుం హవామహే! కవింకవీనా ముపశ్రవస్తమం
జ్యేష్టరాజం బ్రహ్మణాం బ్రహంణస్పత ఆనశ్రుణ్వన్నూతి భిస్సీద సాదనం||

శ్రీ మహాగణాధిపతయే నమః |
ధ్యానం సమర్పయామి|
ఆవాహయామి ఆసనం సమర్పయామి|

పాదయో పాద్యం సమర్పయామి |
హస్తయో అర్గ్యం సమర్పయామి |
శుద్ధ ఆచమనీయం సమర్పయామి|

శుద్దోదక స్నానం:

మం: ఆపోహిష్టామ యోభువహ తాన ఊర్జే దధాతన మహేరణాయ చక్షశే|
యోవశ్శివతమొరసః తస్యభాజయ తేహనః  ఉషతీరివ మాతరః
తస్మా అరణ్గామామవః యస్యక్షయాయ జిన్వద ఆపోజనయదాచానః||

శ్రీ మహాగణాధిపతయే నమః  శుద్దోదక స్నానం సమర్పయామి|
స్నానానంతరం శుద్దాచమనీయం సమర్పయామి |

వస్త్రం:

మం:  అభివస్త్రాసువసన న్యరుశాభిదేను సుదుగాః పూయమానః|
అభిచంద్రా భర్తవేనో హిరణ్యాభ్యశ్వా స్రదినోదేవసోమ||

శ్రీ మహాగణాధిపతయే నమః
వస్త్రయుగ్మం సమర్పయామి|

యజ్ఞోపవీతం:

మం: యజ్ఞోపవీతం పరమంపవిత్రం ప్రజాపతైర్ యత్సహజం పురస్తాత్| 
ఆయుష్య మగ్ర్యం ప్రతిముంచ శుబ్రం యజ్ఞోపవీతం బలమస్తుతెజః||

శ్రీ మహాగణాధిపతయే నమః
యజ్ఞోపవీతం సమర్పయామి|

గంధం: 

మం: గంధద్వారాం దురాధర్శాం నిత్యపుష్టాంకరీషిణీం|
ఈశ్వరీగుం సర్వభూతానాం తామిహోపహ్వాయే శ్రియం||

శ్రీ మహాగణాధిపతయే నమః
గందాన్దారయామి|

అక్షతాన్:

మం: ఆయనేతే పరాయణే  దూర్వారోహంతు
పుష్పిణీ హద్రాశ్చ పున్దరీకాణి సముద్రస్య గృహాఇమే||

శ్రీ మహాగణాధిపతయే నమః
గంధస్యోపరి అలంకారణార్ధం అక్షతాం సమర్పయామి |

అధఃపుష్పైపూజయామి. 

ఓం సుముఖాయనమః
ఓం ఏకదంతాయనమః
ఓం కపిలాయనమః
ఓం గజకర్నికాయనమః
ఓం లంభోదరయానమః
ఓం వికటాయనమః
ఓం విఘ్నరాజాయనమః
ఓం గానాదిపాయనమః
ఓం దూమ్రకేతవే నమః
ఓం గణాధ్యక్షాయ నమః
ఓం ఫాలచంద్రాయనమః
ఓం గజాననాయనమః
ఓం వక్రతుండాయ నమః
ఓం శూర్పకర్ణాయ నమః
ఓం హీరంభాయ నమః
ఓం స్కందాగ్రజాయ నమః
ఓం సర్వసిద్దిప్రదాయకాయ నమః
ఓం శ్రీ మహా గణాధిపతయే నమః నానావిధ పరిమళపత్ర పూజాం సమర్పయామి.

ధూపం:

వనస్పతిర్భవైదూపై నానాగంధైసుసంయుతం|
ఆఘ్రేయస్సర్వ దేవానాం దూపోయం ప్రతిగృహ్యాతాం||

ఓం శ్రీ మహా గణాధిపతయే నమః
దూపమాగ్రాపయామి.

దీపం: 

సాజ్యంత్రివర్తి సంయుక్తం వన్హినాంయోజితం ప్రియం
గ్రుహానమంగళం దీపం త్రిలోఖ్యతిమిరాపహం|
భక్త్యాదీపం ప్రయశ్చామి దేవాయ పరమాత్మనే|
త్రాహిమాం నరకాద్ఘోర దివ్యిజ్యోతిర్నమోస్తుతె ||

ఓం శ్రీ మహా గణాధిపతయే నమః
దీపం దర్శయామి|
దూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి ||

నైవేద్యం:

మం:  ఓం భూర్భువస్సువః| 
ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి|
ధియోయోనః ప్రచోదయాత్ ||

సత్యన్త్వర్తేన పరిశించామి| అమృతమస్తు|| అమృతోపస్త్హరణమసి ||

శ్లో: నైవేద్యం షడ్రసోపేతం ఫలలడ్డుక సంయుతం|
భక్ష్య భోజ్య సమాయుక్తం ప్రీతిప్రతి గృహ్యాతాం||

ఓం శ్రీ మహాగణాధిపతయే నమః మహా నైవేద్యం సమర్పయామి.

శ్లో:  నైవేద్యం షడ్రసోపేతం ఫలలడ్డుక సంయుతం|
భక్ష్య భోజ్య సమాయుక్తం ప్రీతిప్రతి గృహ్యాతాం||

ఓం శ్రీ మహాగణాధిపతయే నమః
మహా నైవేద్యం సమర్పయామి.

ఓం ప్రానాయస్వాహా,
ఓం అపానాయస్వాహః,
ఓం వ్యానాయస్వాహః,
ఓం ఉదానాయస్వాహః,
ఓం సమానాయస్వాహః

మధ్యే మధ్యే పానీయం సమర్పయామి||
అమ్రుతాపితానమసి||
వుత్తరాపోషణం సమర్పయామి ||
హస్తౌ ప్రక్షాళయామి ||
పాదౌ ప్రక్షాళయామి ||
శుద్దాచమనీయం సమర్పయామి ||

తాంబూలం:

ఫూగిఫలై సమాయుక్తం ర్నాగవల్లిదళైర్యుతం|
ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యాతాం||

ఓం శ్రీ మహాగణాధిపతయే నమః
తాంబూలం సమర్పయామి|

నీరాజనం:

మం: హిరణ్యపాత్రం మధోపూర్ణం దదాతి
మాధవ్యోసనీతి   ఏకదా బ్రహ్మణ ముపహరతి
ఏకదైవ ఆయుష్తేజో దదాతి.

ఓం శ్రీ మహాగణాధిపతయే నమః
నీరాజనం సమర్పయామి||

మంత్రపుష్పం:

శ్లో: సుముఖశ్చైక దంతశ్చ కపిలో గజకర్ణికః|
లంభోదరైశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః||

దూమ్రాకేతుర్గనాధ్యక్షో ఫాలచంద్రోగాజాననః|
వక్రతుండశూర్పకర్ణౌ హేరంభస్కందపూర్వజః||

షోడశైతాని నామాని యఃపఠే చ్రునుయాదపి|
విద్యారంభే వివాహేచ ప్రవేశే నిర్ఘమేతదా|
సంగ్రామే సర్వ కార్యేషు విఘ్నస్థస్యనజాయతే|

ఓం శ్రీ మహా గణాధిపతయే నమః
సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి|

ప్రదక్షణ నమస్కారం:

శ్లో: యానికానిచ పాపాని జన్మాంతర కృతానిచ,
తానితాని ప్రనక్ష్యంతి ప్రదక్షిణం పదేపదే||
పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవః|

త్రాహిమాం క్రుపయాదేవ శరణాగతవత్సల
అన్యదా శరణంనాస్తి త్వమేవా శరణంమమ |
తస్మాత్కారుణ్యభావేన రక్షరక్షో గణాధిపః||

ఓం శ్రీ మహా గణాధిపతయే నమః
ఆత్మప్రదక్షణనమస్కారం సమర్పయామి ||

యస్యస్మ్రుత్యాచ నామోక్య తవః పూజ క్రియాదిషు|
న్యూనంసంపూర్ణ తామ్యాటి సద్యోవందే గణాధిపం||

మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిపః|
యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే||

అన్యా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజానేనచ భగవాన్ సర్వాత్మకః సర్వం శ్రీ మహాగానాధిపతి దేవతా సుప్రీతా సుప్రసన్న వరదా భవతు |
ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్థితి భావంతో బృవంతు ||
శ్రీ మహా గణాధిపతి ప్రసాదం శిరసా గృహ్న్నామి ||

మం: యజ్ఞేన యగ్నమయదంతదేవా స్తానిధర్మాని ప్రధమాన్యాసన్ తేహనాకం మహిమానస్సచన్తే  యత్రపూర్వే సాధ్యాస్సంతి దేవాః||

శ్రీ మహా గణాధిపతయే నమః యధాస్థానం ప్రవేశాయామి, శోభనార్దే పునరాగమనాయచ.

వరలక్ష్మి వ్రతము (Varalaxmi Shodashopachaara Puja)

ప్రాణ ప్రతిష్ట:

ఓం అసునీతేహి స్వామినీ, సర్వ జగన్నాయకే యావత్పూజావసానకం తావత్వం ప్రీతిభావేన కలశేస్మిన్ చేత్రేస్మిన్ సంనిన్దిమ్కురు. ఆవాహితోభవ, స్తాపితోభవ, సుప్రసన్నోభవ, వరదోభవ స్తిరాసనం కురు, ( అని పుష్పాక్షితలు కలశముపై చిత్రపతముపై వేయవలెను)

అధ: ధ్యానం:

శ్లో: పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే |
నారాయణప్రియే దేవి సుప్రీతా భావ సర్వదా ||
క్షీరోదార్ణవ సంభూతే కమలే కమలాలయే |
సుస్తిరా భావమే గేహే సురాసుర నమస్కృతే ||
శ్రీ వరలక్ష్మిదెవ్యై నమః ధ్యానం సమర్పయామి.

ఆవాహనం :

శ్లో: సర్వమంగళ మాంగళ్యే విష్ణు వక్షస్థలాలయే |
ఆవాహయామి దేవి త్వాం సుప్రీతా భావ సర్వదా||
శ్రీ వరలక్ష్మిదెవ్యై నమః మావాహయామి.

ఆసనం :

శ్లో: సుర్యాయుత విభాస్పూర్తే స్ఫురద్రత్న విభూషితే|
సింహాసనమిదం దేవీ గృహ్యాతాం సమర్పయామి||
శ్రీ వరలక్ష్మిదెవ్యై నమః రత్న సింహాసనం సమర్పయామి.

అర్ఘ్యం :

శ్లో: శుద్దోదకంచ పాత్రస్థం గంధపుష్పాది మిశ్రితం|
అర్ఘ్యం దాస్యామితే దేవి గృహ్యాతాం హరివల్లభే||
శ్రీ వరలక్ష్మిదెవ్యై నమః అర్ఘ్యం సమర్పయామి.

పాద్యం:

శ్లో: సువాసిత జలం రమ్యం సర్వతీర్ధం సముద్భవం|
పాద్యం గృహాన దేవి త్వం సర్వదేవ నమస్కృతే||
శ్రీ వరలక్ష్మిదెవ్యై నమః పాద్యం సమర్పయామి.

ఆచమనీయం :

శ్లో: సువర్ణ కలశానీతం చందనాగరు సంయుతం|
గృహాణాచమనం దేవి మయాదత్తం శుభాప్రదే||
శ్రీ వరలక్ష్మిదెవ్యై నమః ఆచమనీయం సమర్పయామి.

పంచామృత స్నానం :

శ్లో: పయోధది ఘ్రుతోపెతం శర్కరా మధుసంయుతం|
పంచామృత స్నానమిదం గృహాన కమలాలయే||
శ్రీ వరలక్ష్మిదెవ్యై నమః పంచామృత స్నానం సమర్పయామి.

శుద్దోదక స్నానం :

శ్లో: గంగాజలం మయానీతం మహాదేవ శిరస్థితం|
శుద్దోదక స్నాన మిదం గృహాన పరమేశ్వరి||
శ్రీ వరలక్ష్మిదెవ్యై నమః శుద్దోదక స్నానం సర్పయామి.

వస్త్రయుగ్మం:

శ్లో: సురార్చితాంఘ్రి యుగళేదుకూల వసనప్రియే|
వస్త్రయుగ్మం ప్రదాస్యామి గృహాణ సురపూజితే||
శ్రీ వరలక్ష్మిదెవ్యై నమః వస్త్రయుగ్మం సమర్పయామి.

ఆభరణం:

శ్లో: కేయూర కంకణాదేవి హర నూపుర మేఖలా|
విభూషణాన్య మూల్యాని గృహాణ ఋషిపూజితే||
శ్రీ వరలక్ష్మిదెవ్యై నమః ఆభరణాన్ సమర్పయామి.

మాంగళ్యం: 

శ్లో: తప్త హేమక్రుతం దేవి మాంగళ్యం మంగళప్రదం |
మయాసమర్పితం దేవి గృహాణ త్వం శుభప్రదం||
శ్రీ వరలక్ష్మిదెవ్యై నమః మాంగళ్యం సమర్పయామి.

గంధం:

శ్లో: కర్పూరాగారు కస్తూరిరోచనాది సుసంయుతం|
గంధం దాస్యామి తే దేవి స్వీకురుష్వ శుభప్రదే||
శ్రీ వరలక్ష్మిదెవ్యై నమః గంధం సమర్పయామి.

అక్షతలు:

శ్లో: అక్షతాన్ దవళాన్ దివ్యాన్ శాలియాన్ తండులాన్ శుభాన్|
హరిద్రా కుంకుమోపేతాన్ స్వీకురుష్వాబ్దిపుత్రికే||
శ్రీ వరలక్ష్మిదెవ్యై నమః అక్షతాన్ సమర్పయామి.

పుష్ప పూజ :

శ్లో: మల్లికా జాజి కుసుమై శ్చమ్పక ర్వకులైరపి|
శాతపత్రైశ్చ కల్హారై పూజయామి హరిప్రియే||
శ్రీ వరలక్ష్మిదెవ్యై నమః పుష్పాణి సమర్పయామి.

అధాంగ పూజ :

చంచలాయై నమః - పాదౌ పూజయామి
చపలాయై నమః - జానునీ పూజయామి
పీతాంబరాయై నమః - ఊరూంపూజయామి
కమలవాసిన్యై నమః - కటిం పూజయామి
పద్మాలయాయై నమః - నాభిం పూజయామి
మదనమాత్రే నమః - స్థనౌ పూజయామి
కంభుకంట్యై నమః - కంటం పూజయామి
సుముఖాయై నమః - ముఖం పూజయామి
సునేత్రాయై నమః - నేత్రౌ పూజయామి
రమాయి నమః - కర్ణౌ పూజయామి
కమలాయై నమః - శిరః పూజయామి
శ్రీ వరలక్ష్మై నమః - సర్వాణ్యంగాని పూజయామి

వరలక్ష్మి అష్టోత్తర శతనామావళి

ఓం ప్రకృత్యై నమః
ఓం వికృత్యై నమః
ఓం విద్యాయై నమః
ఓం సర్వభూతహితప్రదాయై నమః
ఓం శ్రద్ధాయై నమః
ఓం విభుత్యై నమః
ఓం సురభ్యై నమః
ఓం పరమాత్మికాయై నమః
ఓం వాచ్యై నమః
ఓం పద్మాలయాయై నమః
ఓం పద్మాయై నమః
ఓం శుచయే నమః
ఓం స్వాహాయై నమః
ఓం స్వధాయై నమః
ఓం సుధాయై నమః
ఓం ధన్యాయై నమః
ఓం హిరణ్మయ్యై నమః
ఓం లక్ష్మి నమః
ఓం నిత్యపుష్టాయై నమః
ఓం విభావర్యై నమః
ఓం ఆదిత్యై నమః
ఓం దిత్యే నమః
ఓం దీప్తాయై నమః
ఓం వసుధాయై నమః
ఓం వాసుదారిన్యై నమః
ఓం కమలాయై నమః
ఓం కాంతాయై నమః
ఓం కామాక్షై నమః
ఓం క్రోధసంభవాయై నమః
ఓం అనుగ్రహప్రదాయై నమః
ఓం బుద్ధయే నమః
ఓం అనఘాయై నమః
ఓం హరివల్లభాయై నమః
ఓం అశోకాయై నమః
ఓం అమృతాయై నమః
ఓం దీప్తాయై నమః
ఓం లోకశోకవినాశిన్యై నమః
ఓం ధర్మనిలయాయై నమః
ఓం కరుణాయై నమః
ఓం లోకమాత్రే నమః
ఓం పద్మప్రియాయై నమః
ఓం పద్మహస్తాయై నమః
ఓం పద్మాక్షై నమః
ఓం పద్మసుందర్యై నమః
ఓం పద్మోద్భవాయై నమః
ఓం పద్మముఖ్యై నమః
ఓం పద్మనాభప్రియాయై నమః
ఓం రమాయై నమః
ఓం పద్మమాలాధరాయై నమః
ఓం దేవ్యై నమః
ఓం పద్మిన్యై నమః
ఓం పద్మగంధిన్యై నమః
ఓం పుణ్యగంధాయై నమః
ఓం సుప్రసన్నాయై నమః
ఓం ప్రసాదాభిముఖ్యై నమః
ఓం ప్రభాయై నమః
ఓం చంద్రవదనాయై నమః
ఓం చంద్రాయై నమః
ఓం చంద్రసహోదర్యై నమః
ఓం చతుర్భుజాయై నమః
ఓం ఛన్ద్రరూపాయై నమః
ఓం ఇందిరాయై నమః
ఓం ఇందుశీతలాయై నమః
ఓం ఆహ్లాదజనన్యై నమః
ఓం పుష్ట్యై నమః
ఓం శివాయై నమః
ఓం శివకర్యై నమః
ఓం సత్యై నమః
ఓం విమలాయై నమః
ఓం విశ్వజనన్యై నమః
ఓం తుష్టయై నమః
ఓం దారిద్ర్యనాశిన్యై నమః
ఓం ప్రీతిపుష్కరిన్యై నమః
ఓం శాంతాయై నమః
ఓం శుక్లమాల్యాంబరాయై నమః
ఓం శ్రియై నమః
ఓం భాస్కర్యై నమః
ఓం బిల్వనిలయాయై నమః
ఓం వరారోహాయై నమః
ఓం యశస్విన్యై నమః
ఓం వసుంధరాయై నమః
ఓం ఉదరాంగాయై నమః
ఓం హరిణ్యై నమః
ఓం హేమమాలిన్యై నమః
ఓం ధనదాన్యకర్యే నమః
ఓం సిద్ధయే నమః
ఓం త్రైనసౌమ్యాయై నమః
ఓం శుభప్రదాయే నమః
ఓం నృపవేష్మగతానందాయై నమః
ఓం వరలక్ష్మి నమః
ఓం వసుప్రదాయై నమః
ఓం శుభాయై నమః
ఓం హిరణ్యప్రాకారాయై నమః
ఓం సముద్రతనయాయై నమః
ఓం జయాయై నమః
ఓం మంగళాదేవ్యై నమః
ఓం విష్ణు వక్షస్థలాయై నమః
ఓం విష్ణుపత్న్యై నమః
ఓం ప్రసన్నాక్ష్యై నమః
ఓం నారాయనసమాశ్రితాయై నమః
ఓం దారిద్రద్వంసిన్యై నమః
ఓం దేవ్యై నమః
ఓం సర్వోపద్రవ నివారిన్యై నమః
ఓం నవదుర్గాయై నమః
ఓం మహాకాళ్యై నమః
ఓం బ్రహ్మావిష్ణుశివాత్మికాయై నమః
ఓం త్రికాలజ్ఞానసంపన్నాయై నమః
ఓం భువనేశ్వర్య నమః
ఓం శ్రీ వరలక్ష్మై నమః

ధూపం:

శ్లో: దశాంగం గగ్గులోపెతం సుగంధిం సుమనోహరం |
ధూపం దాస్యామి దేవేశి వరలక్ష్మి గృహానతం ||
శ్రీ వరలక్ష్మిదెవ్యై నమః దూపమాఘ్రాపయామి.

దీపం : 

శ్లో: ఘ్రుతవర్తి సమాయుక్తం అంధకార వినాశకం |
దీపం దాస్యామి తే దేవి గృహాణ ముదితాభవ ||
శ్రీ వరలక్ష్మిదెవ్యై నమః దీపం దర్శయామి.

నైవేద్యం: 

శ్లో: నైవేద్యం షడ్రసోపేతం దదిమాద్వాజ్య సంయుతం|
నానాభాక్ష్య ఫలోపెతం గృహాణ హరివల్లభే ||
శ్రీ వరలక్ష్మిదెవ్యై నమః నైవేద్యం సమర్పయామి.

తాంబూలం : 

శ్లో: ఫూగీఫల సమాయుక్తం నాగవల్లి దళైర్యుతం |
కర్పూర చూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యాతాం ||
శ్రీ వరలక్ష్మిదెవ్యై నమః తాంబూలం సమర్పయామి.

నీరాజనం: 

శ్లో: నీరాజనం సమానీతం కర్పూరేణ సమన్వితం |
తుభ్యం దాస్యామహం దేవీ గృహ్యాతాం విశ్నువల్లభే ||
శ్రీ వరలక్ష్మిదెవ్యై నమః నీరాజనం సమర్పయామి.

మంత్రపుష్పం: 

శ్లో: పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే |
నారాయనప్రియే దేవి సుప్రీతా భవ సర్వదా ||
శ్రీ వరలక్ష్మిదెవ్యై నమః మంత్రపుష్పం సమర్పయామి.

ప్రదక్షిణ నమస్కారాన్ :

శ్లో: యానికానిచ పాపాని జన్మాంతర కృతానిచ |
తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదేపదే ||
పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాపసంభవ |
త్రాహిమాం క్రుపయాదేవి శరణాగతవత్సలా ||
అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ |
తస్మాత్కారుణ్య భావేన రక్ష రక్షజనార్ధన ||
శ్రీ వరలక్ష్మిదెవ్యై నమః నమస్కారాన్ సమర్పయామి.

తోరపూజ: (తోరమును అమ్మవారి వద్ద వుంచి అక్షతలతో ఈ క్రింది విధముగా పూజింపవలెయును)

కమలాయై నమః ప్రధమగ్రందిం పూజయామి
రమాయి నమః ద్వితీయగ్రందిం పూజయామి
లోకమాత్రేనమః త్రుతీయగ్రందిం పూజయామి
విశ్వజనైన్య నమః చతుర్ధగ్రందిం పూజయామి
వరలక్ష్మైనమః పంచామగ్రందిం పూజయామి
క్షీరాబ్దితనయాయ నమః షష్ఠమగ్రందిం పూజయామి
విశ్వసాక్షినై నమః సప్తమగ్రందిం పూజయామి
చంద్రసహోదరై నమః అష్టమగ్రంధిం పూజయామి
వరలక్ష్మై నమః నవమగ్రందిం పూజయామి.

ఈ క్రింది శ్లోకమును చదువుతూ తోరమును కుడిచేతికి కట్టుకోవలెను.

శ్లో: బధ్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం |
పుత్రపౌత్రాభి వృద్దించ సౌభాగ్యం దేహిమే రమే ||

వాయన దానము: 

వాయనమిచ్చునప్పుడు ఈ క్రింది శ్లోకమును చదువుతూ వాయనము ఇవ్వవలెను.

వాయనము అనగా: ముత్తైదువులకు పసుపు కుంకుమ, రవికె, పండ్లు, దక్షిణ, పుస్తకము పళ్ళెంలో పెట్టి దానము ఇవ్వవలెను.

శ్లో: ఇందిరా ప్రతిగృహ్నాతు ఇందిరా వై దదాతి చ |
ఇందిరా తారకోభాభ్యాం ఇందిరాయై నమోనమః ||

ఈ శ్లోకముతో వాయనము ఇచ్చి అక్షతలు పుచ్చుకొని కథను చదువుకోవలెను.

వరలక్ష్మీ వ్రత- కథ

Story of Varalakshmi Vratham

సూత మహాముని శౌనకుడు మొదలైన మహర్షులని చూసి యిలా అన్నాడు. 'ఓ మునీశ్వరు లారా! స్త్రీలకు సర్వ సౌభాగ్యములు కలుగు వ్రతమొకటి పూర్వము శివుడు పార్వతికి చెప్పాడు. దానిని చెప్తాను వినండి'.

ఒక రోజు కైలాస పర్వతమున శివుడు తన సింహాసనము మీద కూర్చుని ఉండగా, పార్వతీదేవి ఆయనని సమీపించి, 'దేవా! లోకంలో స్త్రీలు ఏ వ్రతం చేస్తే సర్వసౌభాగ్యములను, పుత్రపౌత్రాదులను కలిగి సుఖసంతోషాలతో ఉంటారో అటువంటి వ్రతమేదో సెలవీయండి' అని అడుగగా పరమేశ్వరుడిలా చెప్పాడు. 'ఓ దేవీ! స్త్రీలకు పుత్ర పౌత్రాది సంపత్తులనిచ్చే వ్రతం ఒకటి ఉంది. దాని పేరు వరలక్ష్మీ వ్రతం. ఆ వ్రతమును శ్రావణమాసంలో శుక్లపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారము రోజు చేయవలెను'.

పార్వతీదేవి 'నాథా! ఆ వరలక్ష్మీ వ్రతము అంటే ఏమిటి?, ఏ దేవతను పూజించాలి? ఏ విధంగా చేయాలి? దీనినెవరైనా యింతకు ముందు చేసారా? ఆ వివరములన్నీ చెప్పండి' అని అడుగగా శివుడు పార్వతీదేవిని చూసి, ఓ కాత్యాయనీ! వరలక్ష్మీ వ్రత విశేషాలు చెప్తాను విను.

పూర్వము మగధ దేశమున కుండినమనే ఒక పట్టణం ఉంది. ఆ పట్టణము నిండా బంగారు ప్రాకారములు, బంగారు గోడలు గల ఇళ్ళు ఉన్నాయి. అందులో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉన్నది. ఆమె పతియే ప్రత్యక్ష దైవముగా భావించి, తెల్లవారు ఝామునే లేచి, స్నానం చేసి, పతిదేవుని పూవులతో కొలిచి ఆ తర్వాత అత్తమామలకు అవసరమైన అనేక సేవలు చేసి, యింటి పనులన్నీ ఓర్పుతో, నేర్పుతో చేసుకుంటుండేది. అందరితో ప్రియంగా, మితంగా మాట్లాడుతుండేది. గయ్యాళిగా కాకుండా, ఇంత అణకువగా నున్న ఆ మహా పతివ్రతను చూసి మహాలక్ష్మికి ఆమె మీద అనుగ్రహం కలిగింది.

ఒకరోజు ఆ మాహాయిల్లాలికి కలలో ప్రత్యక్షమై మహాలక్ష్మి ఇలా చెప్పింది. 'ఓ చారుమతీ! నేను వరలక్ష్మీ దేవిని. నీ నడవడిక చూసి, నాకు నీ మీద అనుగ్రహం కలిగి నీకు ప్రత్యక్షమయ్యాను. శ్రావణమాసంలో శుక్ల పక్ష పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజు నువ్వు నన్ను పూజించితే నీకు కోరిన వరములిస్తాను' అలా ప్రత్యక్షమైన అమ్మవారిని చూసి ఎంతో మురిసిపోయిన చారుమతీ దేవి కలలోనే వరలక్ష్మీ దేవికి ప్రదక్షిణ, నమస్కారములు చేసి;

నమస్తే సర్వలోకానాం జనన్యై పుణ్య మూర్తయే శరణ్యే త్రిజగ ద్వంద్యే విష్ణు వక్షస్థలాలయే

అని అనేక విధములు స్తోత్రం చేసింది.

'ఓ జగజ్జననీ! నీ కటాక్షంబు కలిగితే జనులు ధన్యులవుతారు. విద్వాంసులవుతారు. సకల సంపన్నులవుతారు. నేను పూర్వ జన్మలలో చేసిన పూజఫలం వల్ల నీ దర్శనము నాకు కలిగింది'. అనగా వరలక్ష్మీ దేవి సంతోషము చెందింది. ఆ వెంటనే మెలకువ వచ్చి నాలుగు వైపులా చూస్తే చారుమతికి వరలక్ష్మీ దేవి కనబడ లేదు. అప్పుడామెకు అర్థమైంది తాను కలగన్నానని. వెంటనే భర్తనీ, అత్తమామలని లేపి చెప్పగానే వాళ్ళు కూడా చాలా సంతోషించారు. 'ఈ స్వప్నము చాలా ఉత్తమమైనది. దేవి ఆనతి ప్రకారం నువ్వు తప్పకుండా ఆ వ్రతం చెయ్యి' అన్నారు. చారుమతి తన యిరుగు పొరుగున ఉన్న స్త్రీలకు కూడా చెప్పింది. వాళ్ళు , చారుమతి ఎంతో ఉత్కంఠతో శ్రావణ మాసం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూడసాగారు.

వారు ఎంతో ఎదురు చూసిన పౌర్ణమి ముందు శుక్రవారము రానే వచ్చింది. ఈ రోజే కదా వరలక్ష్మీ దేవి చెప్పిన రోజని ఎంతో ఉత్సాహంతో చారుమతి మొదలగు స్త్రీలందరూ పూజకుపక్రమించారు. ప్రాతః కాలమే లేచి తలారా స్నానం చేసి, పట్టు బట్టలను కట్టుకున్నారు. చారుమతి యింట్లో అందరూ చేరారు. అక్కడ ఒక ప్రదేశంలో గోమయముతో అలికారు. ఒక మంటపం ఏర్పరిచారు. దాని మీద ఒక ఆసనం వేసారు. ఆసనం పైన కొత్త బియ్యము పోసి , మర్రిచిగుళ్ళు, మామిడాకుల అలంకారలతో కలశం ఏర్పరిచారు. అందులోకి వరలక్ష్మీ దేవిని అవాహనము చేసారు.

చారుమతి మొదలగు స్త్రీలంతా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేసారు.

పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవీ సుప్రీతా భవసర్వదా

అను ఈ శ్లోకంతో ధ్యాన వాహనాది షోడశోపచార పూజ చేసారు. తొమ్మిది సూత్రములు గల తోరాన్ని కుడి చేతికి కట్టుకున్నారు. వరలక్ష్మీ దేవికి అనేక రకములైన పిండి వంటలు చేసి నైవేద్యం పెట్టారు.

దాని తర్వాత ప్రదక్షిణం చేస్తుండగా ఆ స్త్రీలందరికీ ఘల్లుఘల్లు మని శబ్ధం వినపడింది. వెంటనే తమ కాళ్ళను చూసుకుంటే గజ్జెలు మొదలైన ఆభరణములు కనిపించాయి. చారుమతి మొదలైన స్త్రీలంతా వరలక్ష్మీ దేవి కృపా కటాక్షములు కలిగాయని ఎంతో మురిసి పోయారు. రెండో ప్రదక్షిణం చేయగానే చేతులకు ధగధగ లాడే నవరత్నాలతో కూడిన కంకణములు మొదలైన ఆభరణములు కనిపించాయి. ఇంక వాళ్ల ఆనందం ప్రత్యేకించి చెప్పేదేముంది? మూడవ ప్రదక్షిణం పూర్తి కాగానే అ స్త్రీలంతా సర్వభూషణాలంకృతులయ్యారు. చారుమతి మొదలైన ఆ స్త్రీల యిళ్ళన్నీస్వర్ణమయాలయ్యాయి. వాళ్ళకి రథగజ తురగ వాహనాలు ప్రసాదింపబడ్డాయి.

చారుమతి యింటి నుంచి ఆ స్త్రీలను తీసుకుని పోవడానికి వారి వారి యిళ్ళ నుంచి గుర్రాలు, ఏనుగులు, రథాలు, బండ్లు వచ్చాయి. ఆ స్త్రీలు, చారుమతి కలిసి వారి చేత శాస్త్ర ప్రకారం పూజ చేయించిన బ్రాహ్మణోత్తమునికి గంధం, పుష్పం, అక్షింతలతో పూజించి 12 కుడుములు వాయనమిచ్చి, దక్షిణ తాంబూలములిచ్చి నమస్కరించారు. బ్రాహ్మణుడు వారిని ఆశీర్వదించారు. వరలక్ష్మీ దేవికి నైవేద్యం గా పెట్టిన పిండివంటలను బంధుమిత్రులతో తిని తమ కోసం వచ్చిన గుర్రాలు, ఏనుగులు మొదలైన వాహనాలలోవారి యిండ్లకు బయలు దేరారు.

వారు దోవలో చారుమతి భాగ్యమును, తమ భాగ్యమును ముచ్చటించుకుంటూ వెళ్ళారు. లక్ష్మీదేవి తనంతట తానే స్వప్నములో వచ్చి ప్రత్యక్షమవట మంటే మాటలా? చారుమతి ఎంత అదృష్టవంతురాలు అనుకున్నారు. చారుమతికి ప్రత్యక్షమైన విధానం తన మటుకే దాచుకుని తను ఒక్కతే పూజించకూండా, తమ అందరికీ చెప్పి, తమకి కూడా ఇంతటి సౌభాగ్యం కలగజేసిన చారుమతి ఎంతటి పుణ్యురాలు, అలాంటి ఆమె పరిచయం కలిగి ఉండిన తామెంత భాగ్యవంతులు అని ఎంతో మురుసిపోయారు.

అప్పటి నుంచీ చారుమతితో సహా వారందరూ క్రమం తప్పకుండా ప్రతీ సంవత్సరం ఈ పూజ చేస్తూ పుత్రపౌత్రాభి వృద్ధి కలిగి, ధన కనక వస్తు వాహనములు కలిగి, సుఖ సంతోషాలతో ఉన్నారు. కావున 'ఓ పార్వతీ! ఈ ఉత్తమమైన వ్రతమును చేస్తే, అలా ఎదుటి వారికి చెప్పి చేయిస్తే సర్వసౌభాగ్యములు కలిగి శుభముగా ఉంటారు. ఈ కథను విన్నవారికి, చదివిన వారికి కూడా వరలక్ష్మీ ప్రసాదము వలన సకల కార్యములూ సిద్ధించును' అన్నాడు పరమశివుడు.

సూత మహాముని శౌనకుడు మొదలగు వారితో 'మునులారా! విన్నారుగా చారుమతి ఎదుటివారి మంచి కూడా ఎలా కోరిందో! ఎదుటి మనిషికి మంచి కలగాలని కోరుకుంటే అమ్మవారు యింకా ప్రసన్నురాలై మీరు కోరకుండానే మీకు మంచి చేస్తుంది' అన్నారు.

వరలక్ష్మీ వ్రత కల్పము సమాప్తము.

కథాక్షతలు అమ్మవారి మీద వేసి, మీ మీద వేసుకోండి.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.