Pages

Saraswati Vrata Vidhanam

Saraswati Vrata Vidhanam
Saraswati Vrata Vidhanam
Saraswati Vratakalpam,  How to Perform Saraswati Vrat, Process of Performing Saraswati Vrat, Saraswati Puja vidhi

సరస్వతీ వ్రతకల్పము

గణపతిపూజ 

ఓం శ్రిగురుభ్యోన్నమః,
మహాగాణాదిపతయే నమః,
శ్రీసరస్వతీదేవ్యై నమః. హరిహిఓమ్,

దేవీంవాచ మజనయంత దే వాస్తాం విశ్వరూపాః పశవోవదంతి!

సానోమంద్రేష మూర్జం దుహానా దేనుర్వాగస్మా నుపసుష్టుతైతు|
అయంముహూర్త సుముహూర్తోఅస్తూ||

యశ్శివో నామ రూపాభ్యాం యాదేవి సర్వమంగళా!
తయోసంస్మరనాత్పుమ్సాం సర్వతో జయమంగళం||

శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం|
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే||

తదేవలగ్నం సుదినంతదేవా తారాబలం చంద్రబాలన్తదేవ!
విద్యాబలం దైవబలన్తదేవ లక్ష్మిపతే తేంఘ్రియుగంస్మరామి||

యత్రయోగీశావర కృష్ణో యత్రపార్దో ధనుద్దరః|
తత్ర శ్రీ విజయోర్భూతి ద్రువానీతిర్మతిర్మమ||

స్మృతే సకలకల్యాణి భాజనం యత్రజాయతే|
పురుషస్తమజంనిత్యం వ్రాజామిస్హరణం హరిం||

సర్వదా సర్వ కార్యేషు నాస్తితెశామ మంగళం|
యేషాంహ్రుదిస్తో భగవాన్ మంగళాయతనం హరిం|
లాభాస్తేశాం జయస్తేషాం కుతత్తేషాం పరాభవః||

యేశామింది వరష్యామో హృదయస్తో జనార్దనః|
ఆపదామప హర్తారం దాతారం సర్వసంపదాం|
లోకాభిరామం శ్రీ రామం భూయోభూయోనమామ్యాహం||

సర్వమంగళ మాంగల్యే శివేసర్వార్ధసాదికే|
శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే||

శ్రీ లక్ష్మి నారాయనాభ్యాం నమః|
ఉమా మహేశ్వరాభ్యాం నమః|
వాణీ హిరణ్య గర్భాభ్యాం నమః|
శాచీపురంధరాభ్యాం నమః|
అరుంధతి వశిష్టాభ్యాం నమః|
శ్రీ సీతారామాభ్యాం నమః|
సర్వేభ్యోమహాజనేభ్యో నమః|

ఆచ్యమ్య: 

ఓం కేశవాయ స్వాహాః, నారాయణాయ స్వాహాః, మాధవాయ స్వాహాః

గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, హృషీకేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్దాయ నమః, పురుషోత్తమాయ నమః, అధోక్షజాయ నమః, ,నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీ కృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః

ప్రాణాయామము:

ఉత్తిష్టంతు భూతపిశాచాః ఏతే భూమిభారకాః ఏతేషాం అవిరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఓంభూః ఓం భువః ఓగుం సువః, ఓం మహః ఓంజనః ఓంతపః ఓగుం సత్యం ఓంతత్స వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్.

ఓమాపోజ్యో తీరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం. మమోపాత్త దురితక్షయద్వారా శ్రీపరమేశ్వర వుద్దిస్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీమహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య ఆద్యబ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరత వర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన సంవత్సరము పేరు .......... సంవత్సరే, .......ఆయనే, ....... మాసే, .......పక్షే, ......తిది, ........వాసరే శుభయోగే శుభకరణ ఏవంగుణ విశేషణ, విశిష్టాయాం, శుభతిథౌ శ్రీమాన్ ... గోత్రః ...నామధేయః (ధర్మ పత్నీ సమేతః) మమ ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిధ్యర్థం, పుత్రపౌత్రాభివృద్ధ్యర్థం, సర్వాభీష్ట సిద్ధ్యర్థం, మహా గణాధిపతి ప్రీత్యర్థం ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే, తదంగ కలశారాధనం కరిష్యే.

కలశారాధన:

(కలశమునకు గంధము, కుంకుమబొట్లు పెట్టి, ఒక పుష్పం, కొద్దిగా అక్షతలువేసి, కుడిచేతితో కలశమును మూసి ఈ క్రింది మంత్రమును చెప్పవలెను).

శ్లో.. కలశస్యముఖేవిష్ణుః కంఠేరుద్ర సమాశిత్రాః మూలేతత్రస్థితో బ్రహ్మమధ్యే మాతృగణాస్మృతాః
కుక్షౌతు సాగరాసర్వే సప్తద్వీపోవసుంధరా ఋగ్వేదోథ యజుర్వేద స్సామవేదో హ్యదర్వణః
అంగైశ్చ సహితాసర్వే కలశౌంబుసమాశ్రితాః ఆయాంతు శ్రీ సరస్వతీ పూజార్ధం దురితక్షయ కారకాః

మం: ఆ కలశే
షుధావతే పవిత్రే పరిశిచ్యతే
ఉక్థైర్యజ్ఞేషు వర్ధతే, ఆపోవా ఇదగుం సర్వం
విశ్వా భూతాన్యాపః ప్రాణావాఆపః పశవ ఆపోన్నమాపోమ్రుతమాపః
సమ్రాడాపోవిరాడాప స్వరాదాపః చందాగుశ్యాపో జ్యోతీగుష్యాపో యజోగుష్యాప
<సత్యమాపస్సర్వా దేవతాపో భూర్భువస్సువరాప ఓం.

 శ్లో.. గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతి
నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింకురు ఏవం కలశపూజాః
కలశోదకాని పూజాద్రవ్యాణి సంప్రోక్ష, దేవంసంప్రోక్ష, ఆత్మానం సంప్రోక్ష (అని పఠించి ఆ నీటిని దేవునిపై, పూజాద్రవ్యములపై, తమపై అంతటా చల్లవలెను.)

ప్రాణప్రతిష్ఠ:

మం: ఓం అసునీతే పునరస్మాసు  చక్షు పునః ప్రాణామిహనో దేహిభోగం|
జోక్పస్యేమ  సూర్యముచ్చరంతా మృళయానా స్వస్తి||
 అమ్రుతంవై ప్రాణా అమ్రుతమాపః ప్రానానేవయదా స్థాన ముపహ్వాయతే||
స్తిరోభవ| వరదోభవ| సుముఖోభవ| సుప్రసన్నోభవ| స్తిరాసనంకురు 

ధ్యానం:  

మం: ఓం గణానాంత్వా గణపతిగుం హవామహే! కవింకవీనా ముపశ్రవస్తమం
జ్యేష్టరాజం బ్రహ్మణాం బ్రహంణస్పత ఆనశ్రుణ్వన్నూతి భిస్సీద సాదనం||

శ్రీ మహాగణాధిపతయే నమః |
ధ్యానం సమర్పయామి|
ఆవాహయామి ఆసనం సమర్పయామి|

పాదయో పాద్యం సమర్పయామి |
హస్తయో అర్గ్యం సమర్పయామి |
శుద్ధ ఆచమనీయం సమర్పయామి|

శుద్దోదక స్నానం:

మం: ఆపోహిష్టామ యోభువహ తాన ఊర్జే దధాతన మహేరణాయ చక్షశే|
యోవశ్శివతమొరసః తస్యభాజయ తేహనః  ఉషతీరివ మాతరః
తస్మా అరణ్గామామవః యస్యక్షయాయ జిన్వద ఆపోజనయదాచానః||

శ్రీ మహాగణాధిపతయే నమః  శుద్దోదక స్నానం సమర్పయామి|
స్నానానంతరం శుద్దాచమనీయం సమర్పయామి |

వస్త్రం:

మం:  అభివస్త్రాసువసన న్యరుశాభిదేను సుదుగాః పూయమానః|
అభిచంద్రా భర్తవేనో హిరణ్యాభ్యశ్వా స్రదినోదేవసోమ||

శ్రీ మహాగణాధిపతయే నమః
వస్త్రయుగ్మం సమర్పయామి|

యజ్ఞోపవీతం:

మం: యజ్ఞోపవీతం పరమంపవిత్రం ప్రజాపతైర్ యత్సహజం పురస్తాత్| 
ఆయుష్య మగ్ర్యం ప్రతిముంచ శుబ్రం యజ్ఞోపవీతం బలమస్తుతెజః||

శ్రీ మహాగణాధిపతయే నమః
యజ్ఞోపవీతం సమర్పయామి|

గంధం: 

మం: గంధద్వారాం దురాధర్శాం నిత్యపుష్టాంకరీషిణీం|
ఈశ్వరీగుం సర్వభూతానాం తామిహోపహ్వాయే శ్రియం||

శ్రీ మహాగణాధిపతయే నమః
గందాన్దారయామి|

అక్షతాన్:

మం: ఆయనేతే పరాయణే  దూర్వారోహంతు
పుష్పిణీ హద్రాశ్చ పున్దరీకాణి సముద్రస్య గృహాఇమే||

శ్రీ మహాగణాధిపతయే నమః
గంధస్యోపరి అలంకారణార్ధం అక్షతాం సమర్పయామి |

అధఃపుష్పైపూజయామి. 

ఓం సుముఖాయనమః
ఓం ఏకదంతాయనమః
ఓం కపిలాయనమః
ఓం గజకర్నికాయనమః
ఓం లంభోదరయానమః
ఓం వికటాయనమః
ఓం విఘ్నరాజాయనమః
ఓం గానాదిపాయనమః
ఓం దూమ్రకేతవే నమః
ఓం గణాధ్యక్షాయ నమః
ఓం ఫాలచంద్రాయనమః
ఓం గజాననాయనమః
ఓం వక్రతుండాయ నమః
ఓం శూర్పకర్ణాయ నమః
ఓం హీరంభాయ నమః
ఓం స్కందాగ్రజాయ నమః
ఓం సర్వసిద్దిప్రదాయకాయ నమః
ఓం శ్రీ మహా గణాధిపతయే నమః నానావిధ పరిమళపత్ర పూజాం సమర్పయామి.

ధూపం:

వనస్పతిర్భవైదూపై నానాగంధైసుసంయుతం|
ఆఘ్రేయస్సర్వ దేవానాం దూపోయం ప్రతిగృహ్యాతాం||

ఓం శ్రీ మహా గణాధిపతయే నమః
దూపమాగ్రాపయామి.

దీపం: 

సాజ్యంత్రివర్తి సంయుక్తం వన్హినాంయోజితం ప్రియం
గ్రుహానమంగళం దీపం త్రిలోఖ్యతిమిరాపహం|
భక్త్యాదీపం ప్రయశ్చామి దేవాయ పరమాత్మనే|
త్రాహిమాం నరకాద్ఘోర దివ్యిజ్యోతిర్నమోస్తుతె ||

ఓం శ్రీ మహా గణాధిపతయే నమః
దీపం దర్శయామి|
దూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి ||

నైవేద్యం:

మం:  ఓం భూర్భువస్సువః| 
ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి|
ధియోయోనః ప్రచోదయాత్ ||

సత్యన్త్వర్తేన పరిశించామి| అమృతమస్తు|| అమృతోపస్త్హరణమసి ||

శ్లో: నైవేద్యం షడ్రసోపేతం ఫలలడ్డుక సంయుతం|
భక్ష్య భోజ్య సమాయుక్తం ప్రీతిప్రతి గృహ్యాతాం||

ఓం శ్రీ మహాగణాధిపతయే నమః మహా నైవేద్యం సమర్పయామి.

శ్లో:  నైవేద్యం షడ్రసోపేతం ఫలలడ్డుక సంయుతం|
భక్ష్య భోజ్య సమాయుక్తం ప్రీతిప్రతి గృహ్యాతాం||

ఓం శ్రీ మహాగణాధిపతయే నమః
మహా నైవేద్యం సమర్పయామి.

ఓం ప్రానాయస్వాహా,
ఓం అపానాయస్వాహః,
ఓం వ్యానాయస్వాహః,
ఓం ఉదానాయస్వాహః,
ఓం సమానాయస్వాహః

మధ్యే మధ్యే పానీయం సమర్పయామి||
అమ్రుతాపితానమసి||
వుత్తరాపోషణం సమర్పయామి ||
హస్తౌ ప్రక్షాళయామి ||
పాదౌ ప్రక్షాళయామి ||
శుద్దాచమనీయం సమర్పయామి ||

తాంబూలం:

ఫూగిఫలై సమాయుక్తం ర్నాగవల్లిదళైర్యుతం|
ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యాతాం||

ఓం శ్రీ మహాగణాధిపతయే నమః
తాంబూలం సమర్పయామి|

నీరాజనం:

మం: హిరణ్యపాత్రం మధోపూర్ణం దదాతి
మాధవ్యోసనీతి   ఏకదా బ్రహ్మణ ముపహరతి
ఏకదైవ ఆయుష్తేజో దదాతి.

ఓం శ్రీ మహాగణాధిపతయే నమః
నీరాజనం సమర్పయామి||

మంత్రపుష్పం:

శ్లో: సుముఖశ్చైక దంతశ్చ కపిలో గజకర్ణికః|
లంభోదరైశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః||

దూమ్రాకేతుర్గనాధ్యక్షో ఫాలచంద్రోగాజాననః|
వక్రతుండశూర్పకర్ణౌ హేరంభస్కందపూర్వజః||

షోడశైతాని నామాని యఃపఠే చ్రునుయాదపి|
విద్యారంభే వివాహేచ ప్రవేశే నిర్ఘమేతదా|
సంగ్రామే సర్వ కార్యేషు విఘ్నస్థస్యనజాయతే|

ఓం శ్రీ మహా గణాధిపతయే నమః
సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి|

ప్రదక్షణ నమస్కారం:

శ్లో: యానికానిచ పాపాని జన్మాంతర కృతానిచ,
తానితాని ప్రనక్ష్యంతి ప్రదక్షిణం పదేపదే||
పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవః|

త్రాహిమాం క్రుపయాదేవ శరణాగతవత్సల
అన్యదా శరణంనాస్తి త్వమేవా శరణంమమ |
తస్మాత్కారుణ్యభావేన రక్షరక్షో గణాధిపః||

ఓం శ్రీ మహా గణాధిపతయే నమః
ఆత్మప్రదక్షణనమస్కారం సమర్పయామి ||

యస్యస్మ్రుత్యాచ నామోక్య తవః పూజ క్రియాదిషు|
న్యూనంసంపూర్ణ తామ్యాటి సద్యోవందే గణాధిపం||

మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిపః|
యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే||

అన్యా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజానేనచ భగవాన్ సర్వాత్మకః సర్వం శ్రీ మహాగానాధిపతి దేవతా సుప్రీతా సుప్రసన్న వరదా భవతు |
ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్థితి భావంతో బృవంతు ||
శ్రీ మహా గణాధిపతి ప్రసాదం శిరసా గృహ్న్నామి ||

మం: యజ్ఞేన యగ్నమయదంతదేవా స్తానిధర్మాని ప్రధమాన్యాసన్ తేహనాకం మహిమానస్సచన్తే  యత్రపూర్వే సాధ్యాస్సంతి దేవాః||

శ్రీ మహా గణాధిపతయే నమః యధాస్థానం ప్రవేశాయామి, శోభనార్దే పునరాగమనాయచ.

సరస్వతీ షోడశోపచార పూజ 

ధ్యానం:

శ్లో || పుస్త కేతుయలోదేవి క్రీడతే పరమార్ధతః - తత్ర తత్ర ప్రకుర్వీత|
ధ్యాన మావాహనాది కంధ్యానమేవం ప్రకుర్వీత సాధవో విజితేంద్రియః|
ప్రణవాసన మారూడం తదర్ధత్వేన నిశ్చితాం||

శ్లో: అంకుశంచాక్ష సూత్రంచ పాశం వీణాంచ ధారిణీమ్|
ముకాహార సమాయుక్తం మోద రూపాం మనోహరామ||

సితేనా దర్పణాబ్యే న వస్త్రేణో పరిభూషితా|
సుస్తనే వేదవేద్యాంచ చంద్రార్ధ కృత శేఖరామ్|
జటాక లా సంయుక్తాం పూర్ణ చంద్ర నిభాననామ|
త్రిలోచనాం మహాదేవీ స్వర్ణ నూపుర ధారిణీమ||

కటకై స్వర్ణ రత్నా ద్యైర్ముక్తా వలయ భూషితాం,
కంబుకంటీం సుతామ్రోషీం సర్వాభరణ భూషితామ్||
కేయూరై ఖలా ద్యైశ్చ ద్యోతయంతీ జగత్రయమ్|
శబ్ద బ్రహ్మత్మికాం దేవి ధ్యాన కర్మ సమాహితః||

ఓం శ్రీ సరస్వతీ దేవ్యై నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి.

ఆవాహనం :

శ్లో:  అత్రాగచ్చ జగద్వంద్వే సర్వలోకైక పూజితే,
మయాక్రుతా మిమాం పూజాం గృహాణ జగదీశ్వరీ||

ఓం శ్రీసరస్వతీదేవ్యై నమః ఆవాహయామి.

ఆసనం :

శ్లో || అనేక రత్న సంయుక్తం సువర్ణేన విరాజితం|
ముక్తా మణ్యంచితంచారు చాసనం తే దదామ్య హం||

ఓం శ్రీసరస్వతీదేవ్యై నమః నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి.

పాద్యం:

శ్లో || గంధ పుష్పాక్ష తై స్సార్ధం శుద్ధ తోయేన సంయుతం,
శుద్ధ స్పటిక తుల్యాంగి పాద్యంతే ప్రతిగృహ్యతాం||

ఓం శ్రీసరస్వతీదేవ్యై నమః పాద్యం సమర్పయామి.

అర్ఘ్యం :

శ్లో || భక్తా భీష్ట ప్రదే దేవి దేవదేవాది వందితే,
దాత్రుప్రియే జగద్ధాత్రి దదామ్య ర్ఘ్యం గృహాణ మే||

ఓం శ్రీసరస్వతీదేవ్యై నమః  హస్తౌ: అర్ఘ్యం సమర్పయామి.

ఆచమనీయం :

శ్లో || పూర్ణచంద్ర సమానాభే కోటి సూర్య సమప్రభే,
భక్త్యా సమర్పితం వాణీ గృహాణా చ మనీయకం ||

ఓం శ్రీసరస్వతీదేవ్యై నమః ఆచమనీయం సమర్పయామి.

మధుపర్కం :

శ్లో ||కమల భువన జాయే కోటి సూర్య ప్రకాశే|
విశద శుచివిలాసే కో మలాకార యుక్తే||
దధి మధు ఘ్రుత యుక్తం క్షీర రంభాఫలాడ్యం|
సురుచిర మధుపర్కం గృహ్యాతాం దేవవంద్యే ||

ఓంశ్రీసరస్వతీదేవ్యై నమః మధుపర్కం సమర్పయామి.

పంచామృత స్నానం :

శ్లో || దదిక్షీరఘ్రుతో పేతం శర్కరా మధు సంయుతం,
పంచామృత స్నాన మిదం స్వీకురుష్వ మహేశ్వరీ||

ఓం శ్రీసరస్వతీదేవ్యై నమః  పంచామృత స్నానం సమర్పయామి

శుద్దోదక స్నానం :

శ్లో || శుద్దోదకేనా సుస్నానం కర్తవ్యం విధిపూర్వకం,
సువర్ణ కలశానీ తైర్నానాగంధ సువాసితై:||

ఓం శ్రీసరస్వతీదేవ్యై నమః శుద్దోదక స్నానం సమర్పయామి.

వస్త్రయుగ్మం:

శ్లో ||శకల వస్త్ర ద్వయం దేవి కోమలం కుటిలాలకే,
మయి ప్రీత్యా త్వయా వాణి బ్రహ్మాణీ ప్రతిగ్రుహ్యతాం||

ఓం శ్రీసరస్వతీదేవ్యై నమః  వస్త్ర యుగ్మం సమర్పయామి.

యజ్ఞోపవీతం :

శ్లో || శబ్ద బ్రహ్మాత్మికే దేవి శబ్ద శాస్త్ర కృతాలయే,
బ్రహ్మ సూత్రం గృహాణత్వం బ్రహ్మశక్రాది పూజితే ||

ఓం శ్రీసరస్వతీదేవ్యై నమః యజ్ఞోపవీతం సమర్పయామి

ఆభరణం:

శ్లో || కటకమకుటహరై ర్నపురై రంగదాణ్యై
ర్వివిధ సుమణి యుక్త్యై ర్మేఖలా రత్న హరై: ||
కమలదళ విలసే కామదే సంగృహీ ష్వ
ప్రకటిత కరుణార్ద్రే భూషితే: భూషణాని ||

ఓం శ్రీసరస్వతీదేవ్యై నమః ఆభరణాన్ సమర్పయామి.

గంధం:

శ్లో || కటక మకుటహరైర్నూపురైరంగ ద్యైర్వివిధ
సుమణియుక్త్యైర్మేఖలా రత్నహరై:
కమలదళవిలాసే కామదే సంగృహీష్వ ప్రకటిత
కరుణార్ద్రే భూరితౌ భూషణాని ఆభరణానిచ,
చందనాగరు కస్తూరీ కర్పూరాద్యైశ్చ సంయుతం,
గంధం గృహాణ వర దేవి విధి పత్నీర్నమోస్తుతే||

ఓంశ్రీసరస్వతీదేవ్యై నమః గంధాన్ సమర్పయామి.

అక్షతలు:

శ్లో || అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలియాన్ తుండుల నిర్మితాన్
గృహాణ వరదే దేవి బ్రహ్మశక్తి స్శుభాత్మ కాన్||

ఓం శ్రీసరస్వతీదేవ్యై నమః అక్షతాన్ సమర్పయామి.

పుష్ప పూజ :

శ్లో || మందారాది సుపుష్పైశ్చ మల్లికాభిర్మనోహరై:
కరవీరైర్మనోర మ్యై ర్వకుల లై: కేత కై శ్శుభై:
పున్నా గై ర్జాతీ కుసుమై ర్మందారై శ్చ సుశోభి తై:
నీలోత్పలై: శుభై శ్చాన్యై స్తత్కాల తరు సంభ వై :
కల్పితాని చ మాల్యాని గృహణా మరవందితే||

ఓం శ్రీసరస్వతీదేవ్యై నమః పుష్పాణి సమర్పయామి.

అథాంగ పూజ

ఓం బ్రహ్మణ్యై   నమః పాదౌ పూజయామి
ఓం బ్రహ్మణ్య మూర్తయే నమః గుల్ఫౌ పూజయామి
ఓం జగ త్స్వరూపిణ్యై  నమః జంఘౌ పూజయామి
ఓం జగదాద్యై నమః జానునీ పూజయామి
ఓం చారువిలాసిన్యై నమః ఊరూ పూజయామి
ఓం కమలభూమయే నమః కటిం పూజయామ
ఓం జన్మహీనాయై నమః జఘనం పూజయామి
ఓం గంభీరనాభయే నమః నాభిం పూజయామి
ఓం హరి పూజ్యాయ నమః ఉదరం పూజయామి
ఓం లోకమాత్రే నమః స్తనౌ పూజయామి
ఓం గాన విచక్షనాయై నమః కంటoపూజయామి
ఓం స్కంధప్ర పూజ్యాయై నమః స్కందౌ పూజయామి
ఓం ఘనబహవే నమః బాహూపూజయామి
ఓం పుస్తక ధారిణ్యై నమః హస్తౌ పూజయామి
ఓం శ్రోత్రియ బంధవే నమః  శ్రోత్రే  పూజయామి
ఓం వేద స్వరూపిణ్యై  వక్త్రం పూజయామి
ఓం సువానిన్యై నమః నాసికాం పూజయామి
ఓం బింబ సమానోష్యై నమః ఓష్టౌ పూజయామి
ఓం కమలాచక్షుసే నమః నేత్రే పూజయామి
ఓం తిలకదారిణ్యై నమః ఫాలం పూజయామి
ఓం చంద్రమూర్తయే నమః చికురాన్ పూజయామి
ఓం సర్వప్రదాయై నమః ముఖం పూజయామి
ఓం సరస్వత్యై నమః శిరః పూజయామి
ఓం బ్రహ్మరూపిణ్యై నమః సర్వాంగాణి పూజయామి

శ్రీసరస్వతీదేవి అష్టోత్తర శతనామావళి:

ఓం సరస్వ తైయ్య నమః
ఓం మహాభద్రాయై నమః      
ఓం మహమాయాయై నమః    
ఓం వర ప్రదాయై నమః
ఓం పద్మనిలయాయై నమః
ఓం పద్మా క్ష్రైయ నమః
ఓం పద్మవక్త్రాయై నమః
ఓం శివానుజాయై నమః      
ఓం పుస్త కధ్రతే  నమః
ఓం జ్ఞాన సముద్రాయై నమః
ఓం రమాయై నమః
ఓం పరాయై నమః
ఓం కామర రూపాయై నమః
ఓం  మహా విద్యాయై నమః
ఓం మహాపాత కనాశిన్యై నమః
ఓం మహాశ్రయాయై నమః
ఓం మాలిన్యై  నమః
ఓం మహాభోగాయై నమః
ఓం మహాభుజాయై నమః
ఓం మహాభాగ్యాయై నమః     
ఓం మహొత్సాహాయై నమః
ఓం దివ్యాంగాయై నమః
ఓం సురవందితాయై నమః
ఓం మహాకాళ్యై నమః
ఓం మహాపాశాయై నమః
ఓం మహాకారాయై నమః
ఓం మహాంకుశాయై నమః
ఓం సీతాయై నమః 
ఓం విమలా యై నమః
ఓం విశ్వాయై నమః
ఓం విద్యున్మాలాయై నమః
ఓం వైష్ణవ్యై నమః
ఓం చంద్రికాయ్యై నమః
ఓం చంద్రవదనాయై నమః
ఓం చంద్ర లేఖావిభూషితాయై నమః
ఓం సావిత్ర్యై నమః
ఓం సురసాయై నమః
ఓం దేవ్యై నమః
ఓం దివ్యాలంకార భూషితాయై నమః
ఓం వాగ్దేవ్యై నమః
ఓం వసుధాయ్యై  నమః
ఓం తీవ్రాయై నమః
ఓం మహాభద్రాయై నమః
ఓం మహా బలాయై నమః
ఓం భోగదాయై నమః
ఓం  భారత్యై నమః
ఓం భామాయై నమః
ఓం గోవిందాయై నమః
ఓం గోమత్యై నమః
ఓం శివాయై నమః
ఓం జటిలాయై నమః
ఓం వింధ్యవాసాయై నమః 
ఓం వింధ్యాచల విరాజితాయై నమః
ఓం చండి కాయై నమః
ఓం వైష్ణవ్యై నమః
ఓం బ్రాహ్మ్యై నమః
ఓం బ్రహ్మజ్ఞా నైకసాధ నాయై నమః
ఓం సౌదామాన్యై నమః
ఓం సుధా మూర్త్యై నమః
ఓం సుభద్రాయై నమః
ఓం సుర పూజితాయై నమః
ఓం సువాసిన్యై నమః
ఓం సునాసాయై నమః
ఓం వినిద్రాయై నమః
ఓం పద్మలోచనాయై నమః
ఓం విద్యా రూపాయై నమః
ఓం విశాలాక్ష్యై నమః
ఓం బ్రహ్మాజాయాయై నమః
ఓం మహా ఫలాయై నమః
ఓం త్రయీమూర్త్యై నమః
ఓం త్రికాలజ్ఞాయే నమః
ఓం త్రిగుణాయై నమః
ఓం శాస్త్ర రూపిణ్యై నమః
ఓం శుంభా సురప్రమదిన్యై నమః
ఓం శుభదాయై నమః
ఓం సర్వాత్మికాయై నమః
ఓం రక్త బీజనిహంత్ర్యై నమః
ఓం చాముండాయై నమః
ఓం అంబికాయై నమః
ఓం మాన్ణాకాయ ప్రహరణాయై నమః
ఓం ధూమ్రలోచనమర్దనాయై నమః
ఓం సర్వదే వస్తుతాయై నమః
ఓం సౌమ్యాయై నమః
ఓం సురా సుర నమస్క్రతాయై నమః 
ఓం కాళ రాత్ర్యై నమః
ఓం కలాధారాయై నమః
ఓం రూపసౌభాగ్యదాయిన్యై నమః
ఓం వాగ్దేవ్యై నమః  
ఓం వరారోహాయై నమః
ఓం వారాహ్యై నమః
ఓం వారి జాసనాయై నమః
ఓం చిత్రాంబరాయై నమః
ఓం చిత్ర గంధా యై నమః
ఓం చిత్ర మాల్య విభూషితాయై నమః
ఓం కాంతాయై నమః
ఓం కామప్రదాయై నమః
ఓం వంద్యాయై నమః
ఓం విద్యాధర సుపూజితాయై నమః 
ఓం శ్వేతాననాయై నమః
ఓం నీలభుజాయై నమః
ఓం చతుర్వర్గ ఫలప్రదాయై నమః
ఓం చతురానన సామ్రాజ్యై నమః
ఓం రక్త మధ్యాయై నమః
ఓం నిరంజనాయై నమః
ఓం హంసాసనాయై నమః
ఓం నీలంజంఘాయై నమః
ఓం శ్రీ ప్రదాయై నమః
ఓం బ్రహ్మవిష్ణు శివాత్మి కాయై నమః               
సరస్వత్యష్టోత్తర శతనామ పూజాం సమర్పయామి

ధూపం:

శ్లో: దశాంగం గగ్గులో పేతం సుగంధంచ మనోహరం
గృహాణ కల్యాణి భక్తిత్వం ప్రతిగృహ్యాతామ్

ఓం శ్రీసరస్వతీదేవ్యై నమః దూపమాఘ్రాపయామి.

దీపం : 

శ్లో:  ఘ్రుతావర్తి సంయుక్తం దీపితం దీపమంబికే
గృహాణ చిత్స్వ రూపేత్వం కమలాసన వల్లభే

ఓంశ్రీసరస్వతీదేవ్యై నమఃసాక్షాత్ దీపం దర్శయామి.

నైవేద్యం: 

శ్లో: అపూపాన్ వివిధాన్ స్వాదూన్ శాలిపిష్టోప పాచితాన్
మృదులాన్ గూడా సమ్మిశ్రాన్ సజ్జీరక మరీచికాన్
కదళీపన సామ్రాణి చ పక్వాని సుఫలాని
కందమూల వ్యంజనాని సోపదంశం మనోహరం,
అన్నం చతుర్విదోపేతం క్షీరాన్నంచ ఘ్రుతం
దధిశీతో దకంచ సుస్వాదుస్సుకర్పూరై లాది వాసితం,
భక్ష్యభోజ్య సమాయుక్తం నైవేద్యం ప్రతిఘ్రుహ్యాతాం||

ఓం శ్రీసరస్వతీదేవ్యై నమః నైవేద్యం సమర్పయామి.

తాంబూలం : 

శ్లో: తాంబూలం సకర్పూరం పూగ నాగదళైర్యతం,
గృహాణ దేవదేవేశీ తత్వరూపీ నమోస్తుతే ||

ఓం శ్రీసరస్వతీదేవ్యై నమః తాంబూలం సమర్పయామి.

నీరాజనం: 

శ్లో: నీరాజనం గృహాణత్వం జగదానంద దాయిని,
జగత్తి మిర మార్తాండ మండలేతే నమోనమః ||

ఓం శ్రీసరస్వతీదేవ్యై నమఃకర్పూర నీరాజనం సమర్పయామి.

పుష్పాంజలి: 

శ్లో: శారదే లోకమాతే స్త్వ మాశ్రి తాభీ ష్ట దాయిని
పుష్పాంజలిం  గృహాణత్వం మయాభాక్త్యా సమర్పిత మ్ ||

ఓం శ్రీసరస్వతీదేవ్యై నమఃపుష్పాంజలిం సమర్పయామి.

మంత్రపుష్పం :

శ్లో: యాకుం దేందు తుషార హార ధవళా యా శుభ్ర  వస్త్రాన్వితా 
యా వీణా వరదండ మండిత కరా యా శ్వేత పద్మాసనా
యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభ్రుతిభి ర్దే వై స్సదా పూజితా
సామాం పాతు సరస్వతీ భగవతీ నిశ్శే ష జాడ్యా పహా||

ఓం శ్రీసరస్వతీదేవ్యై నమః మంత్ర పుష్పం సమర్పయామి

ప్రదక్షిణ నమస్కారాన్ :

శ్లో: పాశాంకుశ ధరా వాణీ వీణాపుస్తక ధారిణీ,
మమ వక్త్రే వసే న్నిత్యం దుగ్ద కుందేందు నిర్మలా
చతుర్దశ సువిద్యా సురమతే యా సరస్వతీ,
చతుర్ద శేషు లోకేషు సామే వాచి వ సేచ్చిరమ్ ||

పాహిపాహి జగద్వంద్యే నమస్తే భక్త వత్సలే,
నమస్తుభ్యం నమస్తుభ్యం నమస్తుభ్యం నమోనమః ||

ఓం శ్రీసరస్వతీదేవ్యై నమః ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి.

వాయినదానం: 

శ్లో: భారతీ ప్రతిగృహ్ణాతు భారతీ వై దదాతి చ,
భారతీ తారకోభాభ్యాం భారత్యై తే నమే నమః

ఓం శ్రీసరస్వతీదేవ్యై నమఃవాయందానం సమర్పయామి.

అని శనగలు(నానబెట్టినవి), తాంబూలం(మూడు ఆకులు, వక్క, అరటిపండు), రవికలగుడ్డ,(జాకెట్టు) గుడ్డ, పువ్వులు, 9  రకముల పిండి వంటలు, రకమునకు 9  చొప్పున ఒక పళ్ళెములో పెట్టి, మరొక పళ్ళెములో మూసి, కొంగుపైన కప్పి ముత్తయిదువునకు బొట్టుపెట్టి ఆమెను సరస్వతీ దేవిగా భావించి వాయన మీయవలెను.

ఏ తత్ఫలం శ్రీ సరస్వతీమాతర్పణమస్తు. అంటూ అక్షతలు నీటితో పాటు అరవేణంలో వదలవలెను. పిమ్మట 'శ్రీ సరస్వతీ దేవతా ప్రసాదం శిరసా గృహ్ణామి' అనుకొని దేవివద్ద అక్షతలు తీసుకొని తమ తమ తలలపై వేసుకొనవలెను.ఆ పిదప పసుపు గణపతి ఉన్న పళ్ళెము నొకసారి పైకి ఎత్తి తిరిగి క్రింద ఉంచి పసుపు గణపతిని తీసి దేవుని పీటము పై నుంచవలెను. దీనిని ఉద్వాసన చెప్పటం అంటారు.

శ్లో|| యస్య స్మ్రుత్యాచ నామోక్త్యా త పం పూజాక్రియాది షు
న్యూనం  సంపూర్ణ  తాంయతి సద్యోవందే తమచ్యుత మ్
మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్ధన,
యత్పూజితం మాయాదేవ పరిపూర్ణం తదస్తుతే ||

అనయా ధ్యానావాహనాది షోడశోపచార పూజయాచ భగవాన్ సర్వాత్మకః శ్రీ సరస్వతీ దేవతా సుప్రీత స్సుప్రసన్నో వరదో భవతు. శ్రీ సరస్వతీ దేవతా ప్రసాదం శిరసాగృహ్ణామి అని దేవికి నమస్కరించి ప్రసాదమును స్వీకరించవలెను.

సరస్వతీ వ్రతకథ
Story of Saraswati Vrat, Sarasvati vrat katha

సూతమహాముని శౌనకాది మహామునులను చూచి యిట్లనియె, ఓ మహర్షులారా! మీకొక ఉత్తమమైన వ్రతరాజమును వినిపించెదను వినుడు అని చెప్పసాగెను.  ఆశ్వీయుజ శుక్ల పక్ష పాడ్యమి మొదలుకొని తోమ్మిదిరాత్రులు దుర్గా, లక్ష్మి, సరస్వతిలను పూజించవలెను. లేదా మూలా నక్షత్రము మొదలుకొని పూజ చేయవలెయును.
        
అనిన ఋషివర్యులు సూతమహామునితో ఓ మహాత్మా! పూర్వము ఈ వ్రతమును ఎవరైనా ఆచరించారా? అలా ఆచరించిన వారికి ఎలాంటి ఫలితము కలిగినది? అని అడుగగా ఓ మునులారా!  కృతయుగంబునందు మహా ధర్మాదికుండు, ప్రజాపాలన సమర్దుండు అయిన సుకేతువు అనే రాజు గలదు.  అతనికి సౌందర్య, గాంభీర్య, యౌవన సంపన్నురాలగు సువేది అను భార్య గలదు.

ఇట్లుండగా రాజునకు, అతని జ్ఞాతులకు విరోధము సంభవించి యుద్ధ సన్నద్దుడై కదన రంగమునకు పోయి భీకరముగా యుద్దము చేయుచుండెను.  ఆ యుద్దము నందు సుకేతుడు శత్రువుల దాడికి నిలువజాలక పరుగెత్తి పోవుచుండెను.  ఇట్లు పోవుచున్న సుకేతుడిని చూసి అతని భార్య  ఓహొ ! నా నాథుడు సమరమున నిలువలేక పారిపోవుచున్నాడు నేను ఇచట నిలువఁదగదు అని సువేద భర్తను అనుసరించి వెళ్ళి పోయెను.  ఇట్లు ఇరువురు కొంతదూరము పోయి ఒక అరణ్య ప్రాంతమున ప్రవేశించి క్షుద్భాదా పీడితులగుచు నివసిస్తుండగా, కొన్ని రోజులకు ఆ రాజు వ్యాధి పీడితుడై నడచుటకు గూడా శక్తి లేక యుండెను.  అంత ఆ రాజ పత్ని భాదాతప్తురాలై భర్తను తన తొడపైన నుంచుకొని యుండగా అంగీరస మహర్షి, ఆ వనితామని చెంతకు వచ్చి యిట్లనియె.

ఓ నారీ తిలకమా! నీకు క్షేమముకలుగుగాక!  మీరు ఇరువురు ఎవరు?  ఇచ్చటికి ఎలా వచ్చితిరి?  రాజ్యంబును, బంధు జనులను ఒదిలి ఒంటరిగా ఆకలిచే పీడింపబడుచు ఈ వనమునందు ఎలా సంచరిస్తున్నారు?  అని యడుగగా ఆమెకు మాటాడుటకు నోరురాక, కన్నుల నుండి  బొటబొట కన్నీరు కార్చుచూ వెక్కి వెక్కి యేడ్చుచుండెను.

అంతట ఆ మునివర్యులు ఓ వనితా రత్నమా! బాధపడకు లోకమున ఎవ్వరుకూడా బాధపడుట వలన యే కార్యమును సాధించలేదు.  కావున మీ బాధలన్నియు తొలగిపోయే ఉపాయము చెప్పెదను.  అనగా ఆ సువేది యిట్లనియె.
   
ఓ మునివర్యా!  ఈతను నా భర్త, యితడు రాజ్య పరిపాలనము చేయుచుండగా కొద్ది రోజులకు ఇతనికిని, జ్ఞాతులకును విరోధము సంభవించెను.  అంత ఇరువురు యుద్దమును జేసిరి.  ఆ యుద్దమున శత్రువుల దాడిని తట్టుకోలేక నాభర్త యుద్దము నుండి పారిపోయి వచ్చెను, నేనుకూడా అతనివెంట వచ్చితిని.  కావునా ఓ మహాత్మా! మరల మాకు రాజ్యమును, పుత్రసంతానంబును కలుగుటకు వుపాయంబును జెప్పుమని అనేక విధములుగా ప్రార్ధించెను.  ఆపుడు అంగీరస  మహర్షి ఈవిధముగా అనెను.

ఓ పుణ్యవతి! నా వెంట రమ్ము, అతి సమీపమున పంచవటీ తటాకము నందు దుర్గా క్షేత్రము వున్నది.  అచ్చట ఆ మహా దేవిని భక్తియుక్తులతో పూజించిన నీకు మరల రాజ్యమును పుత్రపౌత్రాది సంపదలు కలుగునని చెప్పిన ఆ సువేది తన భర్తను మోసుకొని అంగీరస మహర్షి దగ్గరకు పోయెను.

ఆ మహర్షి సువేది భర్తతోడ  స్నానము చేయమనిన ఆ పతివ్రతయు స్నానము చేసి వస్త్రములను ఎండ బెట్టుకొని వచ్చినతోడనే అంగీరస మహర్షి సువేదిచే దుర్గా సరస్వతి దేవతలకు షోడశోపచారములతో పూజా చేయించెను.  ఇట్లు సువేది పాడ్యమి మొదలుకొని తొమ్మిది దినములు పూజచేసి, పదియవ దినమున వుదయముననే మేల్కాంచి, స్నానముచేసి పాయసాన్నముచే "దుర్గాదేవి" యొక్క మంత్రమును వుచ్చరించుచు హోమం చేసి ఆంగీరస మహర్షికి దంపత పూజ చేసి వారి యనుగ్రహము వలన దశదానాది వివిధ దానములను చేసి యధావిధిగా వ్రతమును పరిసమాప్తి గావించెను.

అంగీరస మహర్షి ఆశ్రమము నందు కొన్ని దినములు సుఖముగా వుండగా ఆ అమ్మవారి మహత్యం వలన సువేది గర్భము దాల్చి పదియవమాసమున ఒక పుత్రుని గనెను.  అంతటా ఆంగీరస మహర్షి ఆ బాలునకు జాతకర్మాది సంస్కారాదులను ఒనర్చి "సూర్య ప్రతాపుడు" అని నామకరణము చేసెను. ఐదు సంవత్సరములు రాగానే విద్యాభ్యాసమును చేయించెను.  అంతట ఆ బాలుడు సకల క్షాత్ర విద్యలు నేర్చుకొని యౌవనంబు వచ్చిన తోడనే ఆ మహర్షి యొక్క అనుమతి తీసుకొని, తన శత్రువులపైకి యుద్ధమునకుపోయి వారితో భీకర యుద్ధము సల్పి ఆ యుద్ధము నందు శత్రువులను తన అస్త్ర శస్త్రములచే  గడగడ లాడించి వారిని ఓడించి తన రాజ్యమును చేజిక్కించుకొనెను.  పిదప అంగీరస మహర్షి ఆశ్రమమునకు వచ్చి ఆ మునివర్యుని ఆశీర్వాదమును తీసుకొని తల్లితండ్రులను తీసుకొని తన రాజ్యమునకు వెళ్ళెను. 
  
ఆ సువేది ప్రతి సంవత్సరమును దుర్గాసరస్వతులను పూజించుచూ ఇహలోకంబున పుత్రపౌత్రాదులతో సకల సంపదలతో గూడుకొని సుఖముగా నుండి యనంతరము స్వర్గలోకప్రాప్తి  నొందెను.

ఈ వ్రతమును బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రాదులు చేయవచ్చును.  మరియు ఈ కథను వినువారును, పఠించువారును సకల పాప విముక్తులై ఇహలోకమున సర్వసుఖములను అనుభవించి, చివరకు స్వర్గలోక పాప్తి నొందెదరు.

శ్రీ సరస్వతి వ్రతకథ సమాప్తము.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.