Pages

Vaibhava Lakshmi Vratha Vidhanamu

Vaibhava Lakshmi Vratha Vidhanam, How to Perform Vaibhav Lakshmi Vrat?, Vaibhava Lakshmi Puja, Vaibhav Laxmi Vrat

వైభవలక్ష్మి వ్రతం
Vaibhava Lakshmi Vratham

Vaibhava Lakshmi Vratham
Vaibhava Lakshmi Vratha Vidhanamu
గణపతిపూజ

ఓం శ్రిగురుభ్యోన్నమః,
మహాగాణాదిపతయే నమః,
శ్రీ వైభవలక్ష్మి దేవ్యై నమః. హరిహిఓమ్,

దేవీంవాచ మజనయంత దే వాస్తాం విశ్వరూపాః పశవోవదంతి!

సానోమంద్రేష మూర్జం దుహానా దేనుర్వాగస్మా నుపసుష్టుతైతు|
అయంముహూర్త సుముహూర్తోఅస్తూ||

యశ్శివో నామ రూపాభ్యాం యాదేవి సర్వమంగళా!
తయోసంస్మరనాత్పుమ్సాం సర్వతో జయమంగళం||

శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం|
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే||

తదేవలగ్నం సుదినంతదేవా తారాబలం చంద్రబాలన్తదేవ!
విద్యాబలం దైవబలన్తదేవ లక్ష్మిపతే తేంఘ్రియుగంస్మరామి||

యత్రయోగీశావర కృష్ణో యత్రపార్దో ధనుద్దరః|
తత్ర శ్రీ విజయోర్భూతి ద్రువానీతిర్మతిర్మమ||

స్మృతే సకలకల్యాణి భాజనం యత్రజాయతే|
పురుషస్తమజంనిత్యం వ్రాజామిస్హరణం హరిం||

సర్వదా సర్వ కార్యేషు నాస్తితెశామ మంగళం|
యేషాంహ్రుదిస్తో భగవాన్ మంగళాయతనం హరిం|
లాభాస్తేశాం జయస్తేషాం కుతత్తేషాం పరాభవః||

యేశామింది వరష్యామో హృదయస్తో జనార్దనః|
ఆపదామప హర్తారం దాతారం సర్వసంపదాం|
లోకాభిరామం శ్రీ రామం భూయోభూయోనమామ్యాహం||

సర్వమంగళ మాంగల్యే శివేసర్వార్ధసాదికే|
శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే||

శ్రీ లక్ష్మి నారాయనాభ్యాం నమః|
ఉమా మహేశ్వరాభ్యాం నమః|
వాణీ హిరణ్య గర్భాభ్యాం నమః|
శాచీపురంధరాభ్యాం నమః|
అరుంధతి వశిష్టాభ్యాం నమః|
శ్రీ సీతారామాభ్యాం నమః|
సర్వేభ్యోమహాజనేభ్యో నమః|

ఆచ్యమ్య: 

ఓం కేశవాయ స్వాహాః, నారాయణాయ స్వాహాః, మాధవాయ స్వాహాః

గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, హృషీకేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్దాయ నమః, పురుషోత్తమాయ నమః, అధోక్షజాయ నమః, ,నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీ కృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః

ప్రాణాయామము:

ఉత్తిష్టంతు భూతపిశాచాః ఏతే భూమిభారకాః ఏతేషాం అవిరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఓంభూః ఓం భువః ఓగుం సువః, ఓం మహః ఓంజనః ఓంతపః ఓగుం సత్యం ఓంతత్స వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్.

ఓమాపోజ్యో తీరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం. మమోపాత్త దురితక్షయద్వారా శ్రీపరమేశ్వర వుద్దిస్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీమహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య ఆద్యబ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరత వర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన సంవత్సరము పేరు .......... సంవత్సరే, .......ఆయనే, ....... మాసే, .......పక్షే, ......తిది, ........వాసరే శుభయోగే శుభకరణ ఏవంగుణ విశేషణ, విశిష్టాయాం, శుభతిథౌ శ్రీమాన్ ... గోత్రః ...నామధేయః (ధర్మ పత్నీ సమేతః) మమ ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిధ్యర్థం, పుత్రపౌత్రాభివృద్ధ్యర్థం, సర్వాభీష్ట సిద్ధ్యర్థం, మహా గణాధిపతి ప్రీత్యర్థం ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే, తదంగ కలశారాధనం కరిష్యే.

కలశారాధన:

(కలశమునకు గంధము, కుంకుమబొట్లు పెట్టి, ఒక పుష్పం, కొద్దిగా అక్షతలువేసి, కుడిచేతితో కలశమును మూసి ఈ క్రింది మంత్రమును చెప్పవలెను).

శ్లో.. కలశస్యముఖేవిష్ణుః కంఠేరుద్ర సమాశిత్రాః మూలేతత్రస్థితో బ్రహ్మమధ్యే మాతృగణాస్మృతాః
కుక్షౌతు సాగరాసర్వే సప్తద్వీపోవసుంధరా ఋగ్వేదోథ యజుర్వేద స్సామవేదో హ్యదర్వణః
అంగైశ్చ సహితాసర్వే కలశౌంబుసమాశ్రితాః ఆయాంతు శ్రీ వైభవలక్ష్మి దేవ్యై పూజార్ధం దురితక్షయ కారకాః

మం: ఆ కలశే
షుధావతే పవిత్రే పరిశిచ్యతే

ఉక్థైర్యజ్ఞేషు వర్ధతే, ఆపోవా ఇదగుం సర్వం

విశ్వా భూతాన్యాపః ప్రాణావాఆపః పశవ ఆపోన్నమాపోమ్రుతమాపః
సమ్రాడాపోవిరాడాప స్వరాదాపః చందాగుశ్యాపో జ్యోతీగుష్యాపో యజోగుష్యాప

సత్యమాపస్సర్వా దేవతాపో భూర్భువస్సువరాప ఓం.

 శ్లో.. గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతి
నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింకురు ఏవం కలశపూజాః
కలశోదకాని పూజాద్రవ్యాణి సంప్రోక్ష, దేవంసంప్రోక్ష, ఆత్మానం సంప్రోక్ష (అని పఠించి ఆ నీటిని దేవునిపై, పూజాద్రవ్యములపై, తమపై అంతటా చల్లవలెను.)

ప్రాణప్రతిష్ఠ:

మం: ఓం అసునీతే పునరస్మాసు  చక్షు పునః ప్రాణామిహనో దేహిభోగం|
జోక్పస్యేమ  సూర్యముచ్చరంతా మృళయానా స్వస్తి||
 అమ్రుతంవై ప్రాణా అమ్రుతమాపః ప్రానానేవయదా స్థాన ముపహ్వాయతే||
స్తిరోభవ| వరదోభవ| సుముఖోభవ| సుప్రసన్నోభవ| స్తిరాసనంకురు 

ధ్యానం:  

మం: ఓం గణానాంత్వా గణపతిగుం హవామహే! కవింకవీనా ముపశ్రవస్తమం
జ్యేష్టరాజం బ్రహ్మణాం బ్రహంణస్పత ఆనశ్రుణ్వన్నూతి భిస్సీద సాదనం||

శ్రీ మహాగణాధిపతయే నమః |
ధ్యానం సమర్పయామి|
ఆవాహయామి ఆసనం సమర్పయామి|

పాదయో పాద్యం సమర్పయామి |
హస్తయో అర్గ్యం సమర్పయామి |
శుద్ధ ఆచమనీయం సమర్పయామి|

శుద్దోదక స్నానం:

మం: ఆపోహిష్టామ యోభువహ తాన ఊర్జే దధాతన మహేరణాయ చక్షశే|
యోవశ్శివతమొరసః తస్యభాజయ తేహనః  ఉషతీరివ మాతరః
తస్మా అరణ్గామామవః యస్యక్షయాయ జిన్వద ఆపోజనయదాచానః||

శ్రీ మహాగణాధిపతయే నమః  శుద్దోదక స్నానం సమర్పయామి|
స్నానానంతరం శుద్దాచమనీయం సమర్పయామి |

వస్త్రం:

మం:  అభివస్త్రాసువసన న్యరుశాభిదేను సుదుగాః పూయమానః|
అభిచంద్రా భర్తవేనో హిరణ్యాభ్యశ్వా స్రదినోదేవసోమ||

శ్రీ మహాగణాధిపతయే నమః
వస్త్రయుగ్మం సమర్పయామి|

యజ్ఞోపవీతం:

మం: యజ్ఞోపవీతం పరమంపవిత్రం ప్రజాపతైర్ యత్సహజం పురస్తాత్| 
ఆయుష్య మగ్ర్యం ప్రతిముంచ శుబ్రం యజ్ఞోపవీతం బలమస్తుతెజః||

శ్రీ మహాగణాధిపతయే నమః
యజ్ఞోపవీతం సమర్పయామి|

గంధం: 

మం: గంధద్వారాం దురాధర్శాం నిత్యపుష్టాంకరీషిణీం|
ఈశ్వరీగుం సర్వభూతానాం తామిహోపహ్వాయే శ్రియం||

శ్రీ మహాగణాధిపతయే నమః
గందాన్దారయామి|

అక్షతాన్:

మం: ఆయనేతే పరాయణే  దూర్వారోహంతు
పుష్పిణీ హద్రాశ్చ పున్దరీకాణి సముద్రస్య గృహాఇమే||

శ్రీ మహాగణాధిపతయే నమః
గంధస్యోపరి అలంకారణార్ధం అక్షతాం సమర్పయామి |

అధఃపుష్పైపూజయామి. 

ఓం సుముఖాయనమః
ఓం ఏకదంతాయనమః
ఓం కపిలాయనమః
ఓం గజకర్నికాయనమః
ఓం లంభోదరయానమః
ఓం వికటాయనమః
ఓం విఘ్నరాజాయనమః
ఓం గానాదిపాయనమః
ఓం దూమ్రకేతవే నమః
ఓం గణాధ్యక్షాయ నమః
ఓం ఫాలచంద్రాయనమః
ఓం గజాననాయనమః
ఓం వక్రతుండాయ నమః
ఓం శూర్పకర్ణాయ నమః
ఓం హీరంభాయ నమః
ఓం స్కందాగ్రజాయ నమః
ఓం సర్వసిద్దిప్రదాయకాయ నమః
ఓం శ్రీ మహా గణాధిపతయే నమః నానావిధ పరిమళపత్ర పూజాం సమర్పయామి.

ధూపం:

వనస్పతిర్భవైదూపై నానాగంధైసుసంయుతం|
ఆఘ్రేయస్సర్వ దేవానాం దూపోయం ప్రతిగృహ్యాతాం||

ఓం శ్రీ మహా గణాధిపతయే నమః
దూపమాగ్రాపయామి.

దీపం: 

సాజ్యంత్రివర్తి సంయుక్తం వన్హినాంయోజితం ప్రియం
గ్రుహానమంగళం దీపం త్రిలోఖ్యతిమిరాపహం|
భక్త్యాదీపం ప్రయశ్చామి దేవాయ పరమాత్మనే|
త్రాహిమాం నరకాద్ఘోర దివ్యిజ్యోతిర్నమోస్తుతె ||

ఓం శ్రీ మహా గణాధిపతయే నమః
దీపం దర్శయామి|
దూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి ||

నైవేద్యం:

మం:  ఓం భూర్భువస్సువః| 
ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి|
ధియోయోనః ప్రచోదయాత్ ||

సత్యన్త్వర్తేన పరిశించామి| అమృతమస్తు|| అమృతోపస్త్హరణమసి ||

శ్లో: నైవేద్యం షడ్రసోపేతం ఫలలడ్డుక సంయుతం|
భక్ష్య భోజ్య సమాయుక్తం ప్రీతిప్రతి గృహ్యాతాం||

ఓం శ్రీ మహాగణాధిపతయే నమః మహా నైవేద్యం సమర్పయామి.

శ్లో:  నైవేద్యం షడ్రసోపేతం ఫలలడ్డుక సంయుతం|
భక్ష్య భోజ్య సమాయుక్తం ప్రీతిప్రతి గృహ్యాతాం||

ఓం శ్రీ మహాగణాధిపతయే నమః
మహా నైవేద్యం సమర్పయామి.

ఓం ప్రానాయస్వాహా,
ఓం అపానాయస్వాహః,
ఓం వ్యానాయస్వాహః,
ఓం ఉదానాయస్వాహః,
ఓం సమానాయస్వాహః

మధ్యే మధ్యే పానీయం సమర్పయామి||
అమ్రుతాపితానమసి||
వుత్తరాపోషణం సమర్పయామి ||
హస్తౌ ప్రక్షాళయామి ||
పాదౌ ప్రక్షాళయామి ||
శుద్దాచమనీయం సమర్పయామి ||

తాంబూలం:

ఫూగిఫలై సమాయుక్తం ర్నాగవల్లిదళైర్యుతం|
ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యాతాం||

ఓం శ్రీ మహాగణాధిపతయే నమః
తాంబూలం సమర్పయామి|

నీరాజనం:

మం: హిరణ్యపాత్రం మధోపూర్ణం దదాతి
మాధవ్యోసనీతి   ఏకదా బ్రహ్మణ ముపహరతి
ఏకదైవ ఆయుష్తేజో దదాతి.

ఓం శ్రీ మహాగణాధిపతయే నమః
నీరాజనం సమర్పయామి||

మంత్రపుష్పం:

శ్లో: సుముఖశ్చైక దంతశ్చ కపిలో గజకర్ణికః|
లంభోదరైశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః||

దూమ్రాకేతుర్గనాధ్యక్షో ఫాలచంద్రోగాజాననః|
వక్రతుండశూర్పకర్ణౌ హేరంభస్కందపూర్వజః||

షోడశైతాని నామాని యఃపఠే చ్రునుయాదపి|
విద్యారంభే వివాహేచ ప్రవేశే నిర్ఘమేతదా|
సంగ్రామే సర్వ కార్యేషు విఘ్నస్థస్యనజాయతే|

ఓం శ్రీ మహా గణాధిపతయే నమః
సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి|

ప్రదక్షణ నమస్కారం:

శ్లో: యానికానిచ పాపాని జన్మాంతర కృతానిచ,
తానితాని ప్రనక్ష్యంతి ప్రదక్షిణం పదేపదే||
పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవః|

త్రాహిమాం క్రుపయాదేవ శరణాగతవత్సల
అన్యదా శరణంనాస్తి త్వమేవా శరణంమమ |
తస్మాత్కారుణ్యభావేన రక్షరక్షో గణాధిపః||

ఓం శ్రీ మహా గణాధిపతయే నమః
ఆత్మప్రదక్షణనమస్కారం సమర్పయామి ||

యస్యస్మ్రుత్యాచ నామోక్య తవః పూజ క్రియాదిషు|
న్యూనంసంపూర్ణ తామ్యాటి సద్యోవందే గణాధిపం||

మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిపః|
యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే||

అన్యా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజానేనచ భగవాన్ సర్వాత్మకః సర్వం శ్రీ మహాగానాధిపతి దేవతా సుప్రీతా సుప్రసన్న వరదా భవతు |
ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్థితి భావంతో బృవంతు ||
శ్రీ మహా గణాధిపతి ప్రసాదం శిరసా గృహ్న్నామి ||

మం: యజ్ఞేన యగ్నమయదంతదేవా స్తానిధర్మాని ప్రధమాన్యాసన్ తేహనాకం మహిమానస్సచన్తే  యత్రపూర్వే సాధ్యాస్సంతి దేవాః||

శ్రీ మహా గణాధిపతయే నమః యధాస్థానం ప్రవేశాయామి, శోభనార్దే పునరాగమనాయచ.

వైభవలక్ష్మి పూజ ప్రారంభము
Vaibhava Lakshmi Pooja Vidhanam

ముందుగా కలశముపై గిన్నెలో ఉంచిన శ్రీ వైభవలక్ష్మి దేవి యొక్క స్వర్ణ ప్రతిమనుగాని, వెండి ప్రతిమనుగాని లేదా ఏదైనా ప్రస్తుతము చలామణి లో వున్న నాణెమును గాని శుద్ధిచేసి అందులో వుంచవలెను.

ప్రాణ ప్రతిష్ట:

ఓం అస్యశ్రీ ప్రాణ ప్రతిష్టాపన మహామంత్రస్య బ్రహ్మా విష్ణు మహేశ్వరా ఋషయః ఋగ్యజుర్సామా ధార్వాణి చందాసి ప్రాణః శక్తి, పరాదేవతా, హ్రాం బీజం, హ్రీం శక్తి , క్రోం కీలకం, శ్రీ వైభవలక్ష్మి ప్రాణ ప్రతిష్టాపనే వినియోగః,

అంగన్యాసము:

హ్రాం అంగుష్టాభ్యాం నమః
హ్రీం తర్జనీభ్యాం నమః
హ్రూం మధ్యమాభ్యాం నమః
హ్రైం అనామికాభ్యాం నమః
హ్రౌం కనిష్టికాభ్యాం నమః
హ్రః కరతలకర పృష్టాభ్యాం నమః

హృదయన్యాసం:

హ్రాం హృదయాయ నమః
హ్రీం శిరసే నమః
హ్రూం శిఖాయై వషట్
హ్రైం కవచాయహుం
హ్రౌం నేత్రత్రయాయ వౌషట్
హ్రః అస్త్రాయఫట్
ఓం భూర్భువస్సువరోమితి దిగ్భందః

ఓం ఆం హ్రీం క్రోం యం రం లం వం శం షం సం హం ళం క్షం శ్రీ వైభవలక్ష్మి ప్రాణ ఇహప్రాణ, ఓం ఆం హ్రీం క్రోం శ్రీ వైభవలక్ష్మి సర్వేంద్రియ వాజ్మనశ్చక్షు శ్రోత్రజిహ్వఘ్రాణ, కరచరణాదిభి ఇహైవాగాచ్చ.

ఓం అసునీతే పునరస్మాసుచక్షు పునః ప్రాణ మిహనో దేహిభోగం | జోక్పశ్యేమ సూర్యముచ్చారంతా మనుమతే మ్రుడయానస్వస్తి| అమృతంవై ప్రాణా అమృతమాపః ప్రాణానేవయదా స్థాన ముపహ్వాయతే, సాంగం సాయుధం సవాహనం సశక్తి పత్నీపుత్ర పరివార సమేతం శ్రీ వైభవలక్ష్మిమ్ ఆవాహయామి, స్థాపయామి, పూజయామి.

ధ్యానం:

శ్లో: పద్మాంగీ పద్మజా పద్మా పద్మేషి పద్మవాసినీ,
పద్మపాత్ర విశాలాక్షి పాతుమాం శ్రీ రామా సదా.
ఓం శ్రీ వైభవలక్ష్మి దేవ్యై నమః ధ్యానం సమర్పయామి.

ఆవాహనం:

శ్లో: సర్వమంగళ మాంగళ్యే విష్ణువక్షస్తలాలయే ,
ఆవాహయామి దేవీత్వాం సుప్రీతాభవ సర్వదా.
ఓం శ్రీ వైభవలక్ష్మి దేవ్యై నమః ఆవాహయామి.

ఆసనం:

శ్లో: ఏహి దేవి గృహాణేదం రత్నసింహాసనం శుభం,
చంద్రకాంత మణిస్థంభ సౌవర్ణం సర్వసుందరం.
ఓం శ్రీ వైభవలక్ష్మి దేవ్యై నమః రత్న సింహాసనం సమర్పయామి.

పాద్యం:

శ్లో: ఈశాది దేవ సంసేవ్యే భవే పాద్యం శుభప్రదే,
గంగాది సరితానీతం సంగృహాణ సురేశ్వరీ.
ఓం శ్రీ వైభవలక్ష్మి దేవ్యై నమః పాదయో పాద్యం సమర్పయామి.

అర్ఘ్యం:

శ్లో: వాణీంద్రాణీ ముఖాసేవ్యే దేవదేవేశ వందితే,
గృహాణఅర్ఘ్యం మయాదత్తం విష్ణు పత్నీ నమోస్తుతే.
ఓం శ్రీ వైభవలక్ష్మి దేవ్యై నమః హస్తయో అర్ఘ్యం సమర్పయామి.

ఆచమనీయం:

శ్లో: శ్రీ మూర్తిశ్రితమందారే సర్వభాక్తాభి వందితే,
గృహాణ ఆచమనీయం దేవీ మయా దత్తం మహేశ్వరి.
ఓం శ్రీ వైభవలక్ష్మి దేవ్యై నమః శుద్ధ ఆచమనీయం సమర్పయామి.

పంచామృత స్నానం:

ఓం ఆప్యాయస్వ సమేతుతే విశ్వత స్సోమవ్రుష్ణ్య మ్భ, భవా వాజస్య సంగథే. (పాలు)
ఓం దధి క్రావ్ణో అకారి షం జిష్ణోర శ్వ స్య వాజినః సురభి నో ముఖా కరత్ప్ర ణ ఆయోగ్గ్ షి తారి షత్. (పెరుగు)
ఓం శుక్రమసి, జ్యోతిరసి, తెజోసి దేవోవస్వితాత్పునః, త్వచ్చిద్రేనా పవిత్రేనా వసో సూర్యస్య రశ్మిభి. (నెయ్యి)
ఓం మధువాతా ఋతాయతే మధుక్ష రన్తి సివ్దవః మాద్వీర్న స్సన్త్వో షధీః,
మధునక్త ముతో మధుమత్పార్థి వగ్గ్ రజః మధుద్యౌ రన్తు నః పితా
మధుమాన్నో వన స్పతిర్మధుమాం అస్తు సూర్యః మాధ్వి ర్గావో భవస్తు వః. (తేనే)
ఓం స్వాదుపవస్వ దివ్యాయ జన్మనే స్వాదురింద్రాయ సుహావేతునామ్నే,
స్వాదుమిత్రాయ వరునాయ వాయవే, బృహస్పతయే మధుమాగుం అదాభ్యః (పంచదార)
ఓం శ్రీ వైభవలక్ష్మి దేవ్యై నమః పంచామృత స్నానం సమర్పయామి.

శుద్దోదక స్నానం:

శ్లో: హత్యాది పాపశమనే హరిదశ్వాది వందితే,
సువర్ణ కలాశానీతే శీతై స్నాహి శుభై ర్జలై.
ఓం శ్రీ వైభవలక్ష్మి దేవ్యై నమః శుద్దోదక స్నానం సమర్పయామి.

వస్త్రం:

శ్లో: సకారారూపి సర్వేశీ సర్వహన్త్రీ , సనాతనీ,
సౌవర్ణాచల సంయుక్తం వస్త్రయుగ్మం చ ధారయ.
ఓం శ్రీ వైభవలక్ష్మి దేవ్యై నమఃవస్త్రయుగ్మం సమర్పయామి.

ఆభరణాదికం:

శ్లో: కకారాఖ్యే కమలాఖ్యే కామితార్ధ ప్రదాయిని,
భూషణాని స్వీకురుష్వ మయాదట్టాని హి రమే.
ఓం శ్రీ వైభవలక్ష్మి దేవ్యై నమః సమస్త దివ్యాభరణాని సమర్పయామి.

గంధం:

శ్లో: కర్పూరాగరు సంయుక్తం, కస్తూరి రోచనాన్వితం.
గంధం దాస్యామ్యహం దేవి ప్రీత్యర్ధం ప్రతి గృహ్యాతాం.
ఓం శ్రీ వైభవలక్ష్మి దేవ్యై నమః శ్రీ గంధం సమర్పయామి.

కిరీటం:

శ్లో: విష్ణుపత్ని విశ్వరాజ్ఞి లయస్తిత్యుద్భావేశ్వరి
సువర్ణా అక్షతాన్ దేవి గృహాణ కరుణాకరి.
ఓం శ్రీ వైభవలక్ష్మి దేవ్యై నమః నవరత్న ఖచిత కిరీటాదికాన్ సమర్పయామి.

అక్షతాన్:

శ్లో: అక్షతాన్ దవలాన్ దివ్యాన్ శాలియాన్ తండులాన్ శుభాన్
హరిద్రా కుంకుమోపేతాన్ గృహ్యాతా మబ్ది పుత్రికే.
ఓం శ్రీ వైభవలక్ష్మి దేవ్యై నమః అక్షతాన్ సమర్పయామి.

పుష్ప సమర్పణ:

శ్లో: క్షీర సాగర సంభూతం ఇందిరా మిందుసోదరి,
కుందమందార పుష్పాదీన్ గృహాణ జగదీశ్వరి.
ఓం శ్రీ వైభవలక్ష్మి దేవ్యై నమః పుష్పాంజలీం సమర్పయామి.

అధాంగ పూజ:

ఓం చంచలాయై నమః - పాదౌ పూజయామి
ఓం చపలాయై నమః - జానునీ పూజయామి
ఓం పీతాంబరధరాయై నమః - ఊరూం పూజయామి
ఓం కమలవాసిన్యై నమః - కటిం పూజయామి
ఓం పద్మాలయాయై నమః - నాభిం పూజయామి
ఓం మదనమాత్రే నమః - స్తనౌ పూజయామి
ఓం లలితాయై నమః - భుజాన్ పూజయామి
ఓం కంభుకంట్ట్యై నమః - కన్ట్టం పూజయామి
ఓం సుముఖాయై నమః - ముఖం పూజయామి
ఓం శ్రియై నమః - ఓష్టౌ పూజయామి
ఓం సునాసికాయై నమః - నాసికాం పూజయామి
ఓం సునేత్ర్యై నమః - నేత్రే పూజయామి
ఓం రమాయై నమః - కర్ణౌ పూజయామి
ఓం కమలాలయాయై నమః - శిరః పూజయామి
ఓం శ్రీ వైభవలక్ష్మి దేవ్యై నమః - సర్వాణ్యంగాని పూజయామి.

శ్రీ వైభవలక్ష్మిదెవి అష్ట్తోత్తర శతనామావళి
Vibhava Lakshmi Astottara Shata Namavali

ఓం ప్రకృత్యై నమః
ఓం వికృత్యై నమః
ఓం విద్యాయై నమః
ఓం సర్వభూతహిత ప్రదాయై నమః
ఓం శ్రద్ధాయై నమః
ఓం విభూత్యై నమః
ఓం సురభ్యై నమః
ఓం పరమాత్మికాయై నమః
ఓం పద్మాయై నమః
ఓం సుచ్యై నమః
ఓం స్వాహాయై నమః
ఓం స్వధాయై నమః
ఓం సుధాయై నమః
ఓం ధన్యాయై నమః
ఓం హిరణ్మయై నమః
ఓం లక్ష్మ్యై నమః
ఓం నిత్యపుష్టాయై నమః
ఓం విభావర్త్యై నమః
ఓం ఆదిత్యై నమః
ఓం దిత్యై ది నమః
ఓం దీప్తాయై నమః
ఓం వసుధాయై నమః
ఓం వసుధారిణ్యై నమః
ఓం కమలాయై నమః
ఓం కాంతాయై నమః
ఓం కామాక్ష్యై నమః
ఓం క్రోధసంభవాయై నమః
ఓం అనుగ్రహప్రదాయై నమః
ఓం బుద్ద్యై నమః
ఓం అనఘాయై నమః
ఓం హరివల్లభాయై నమః
ఓం అశోఖాయై నమః
ఓం అమృతాయై నమః
ఓం దీప్తాయై నమః
ఓం లోకశోక వినాశిన్యై నమః
ఓం ధర్మనిలాయాయై నమః
ఓం కరుణాయై నమః
ఓం లోకమాత్రే నమః
ఓం పద్మప్రియాయై నమః
ఓం పద్మహస్తాయై నమః
ఓం పద్మక్ష్యై నమః
ఓం పద్మ సుందర్యై నమః
ఓం పద్మోద్భవాయై నమః
ఓం పద్మముఖ్యై నమః
ఓం పద్మనాభ ప్రియాయై నమః
ఓం రమాయై నమః
ఓం పద్మమాలధరాయై నమః
ఓం దేవ్యై నమః
ఓం పద్మిన్యై నమః
ఓం పద్మగంధిన్యై నమః
ఓం పుణ్యగంధాయై నమః
ఓం సుప్రసన్నాయై నమః
ఓం ప్రసాదాభిముఖ్యై నమః
ఓం ప్రభాయై నమః
ఓం చంద్రవదనాయై నమః
ఓం చంద్రాయై నమః
ఓం చంద్రసహోదర్యై నమః
ఓం చతుర్భుజాయై నమః
ఓం చంద్రరూపాయై నమః
ఓం ఇందిరాయై నమః
ఓం ఇందుశీతలాయై నమః
ఓం ఆహ్లాదజనన్యై నమః
ఓం పుష్ట్యై నమః
ఓం శివాయై నమః
ఓం సివకర్త్యై నమః
ఓం సత్యై నమః
ఓం విమలాయై నమః
ఓం విశ్వజనన్యై నమః
ఓం పుష్ట్యై నమః
ఓం దారిద్ర్యనాశిన్యై నమః
ఓం ప్రీతిపుష్కరిణ్యై నమః
ఓం శాంతాయై నమః
ఓం శుక్లమాల్యాంబరాయై నమః
ఓం శ్రియై నమః
ఓం భాస్కర్యై నమః
ఓం బిల్వనిలయాయై నమః
ఓం వరారోహాయై నమః
ఓం యశస్విన్యై నమః
ఓం వసుంధరాయ నమః
ఓం ఉదారాంగాయై నమః
ఓం హరిణ్యై నమః
ఓం హేమమాలిన్యై నమః
ఓం ధనధాన్యకర్త్యై నమః
ఓం సిద్ద్యై నమః
ఓం స్త్ర్యైణ సౌమ్యాయై నమః
ఓం సుభప్రదాయై నమః
ఓం నృపవేశ్యగతానందాయై నమః
ఓం వరలక్ష్మ్యై నమః
ఓం అసుప్రదాయై నమః
ఓం శుభాయై నమః
ఓం హిరణ్యప్రాకారాయై నమః
ఓం సముద్రతనయాయై నమః
ఓం జయాయై నమః
ఓం మంగలాదేవ్యై నమః
ఓం విష్ణువక్షస్థలస్థితాయై నమః
ఓం విష్ణుపత్న్యై నమః
ఓం ప్రసన్నాక్ష్యై నమః
ఓం నారాయణ సమాశ్రితాయై నమః
ఓం దారిద్ర్యద్వంసిన్యై నమః
ఓం దేవ్యై నమః
ఓం సర్వోపద్రవవారిణ్యై నమః
ఓం నవదుర్గాయై నమః
ఓం మహాకాళ్యై నమః
ఓం బ్రహ్మవిష్ణు శివాత్మికాయై నమః
ఓం త్రికాలజ్ఞాన సంపన్నాయై నమః
ఓం భువనేశ్వర్యై నమః
శ్రీ వైభవలక్ష్మిదెవ్యై నమః

ధూపం:

శ్లో: క్షీరోత్తుంగా తరంగజే శ్రీ విష్ణు వక్షస్థల స్థితే
ధూపం గృహాణ కమలే పాపం నాశయ పాహిమాం.
ఓం శ్రీ వైభవలక్ష్మి దేవ్యై నమః దూపమాఘ్రాపయామి.

దీపం:

శ్లో: సర్వలోక ప్రాణరూప జగదైక ప్రకాశిక
దీపం గృహాణ దేవేశి భక్త్యా ప్రజ్వలితం మయా.
ఓం శ్రీ వైభవలక్ష్మి దేవ్యై నమః దీపం దర్శయామి.

నైవేద్యం:

శ్లో; సర్వాతిషయ సర్వాంగ సౌందర్యా లబ్ద విభ్రమే
కాలేకల్పిత నైవేద్యం త్వం గృహాణ మయార్పితం.
ఓం శ్రీ వైభవలక్ష్మి దేవ్యై నమః నైవేద్యం సమర్పయామి.

తాంబూలం:

శ్లో: రాగినీ రాగకృతు రాగేషి రాగాలోలుపే
త్వంగ్రుహాణ మహాదేవి తాంబూలం వక్త్రరాగిణి
ఓం శ్రీ వైభవలక్ష్మి దేవ్యై నమః తాంబూలం సమర్పయామి.

నీరాజనం:

శ్లో: శుద్ధ జ్యోతి మోక్షజ్యోతి పరంజ్యోతీ పరాత్మికే పరం జ్యోతీ
నీరాజనం గృహాణేదం పరంజ్యోతి శుభప్రదం.
ఓం శ్రీ వైభవలక్ష్మి దేవ్యై నమః నీరాజనం సమర్పయామి.

మంత్రపుష్పం:

శ్లో: సర్వమంత్రప్రదే దేవి సర్వ మంత్రాన్తరాత్మికే
పంత్రపుశ్పం గృహాణేదం సర్వమంత్ర నిమంత్రిణం .
ఓం శ్రీ వైభవలక్ష్మి దేవ్యై నమః పంత్రపుశ్పం సమర్పయామి.

ప్రదక్షిణం:

శ్లో: కామరూపి కామదాయి సర్వలోకైక కామనే,
పరిభ్రామిత సర్వాందే స్వీకురుష్వ ప్రదక్షిణాన్.
ఓం శ్రీ వైభవలక్ష్మి దేవ్యై నమః ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి.

అనేనా సమయాకృత షోడశోపచార పూజానేన భగవతీ సర్వాత్మికా శ్రీ వైభవలక్ష్మి దేవతా సుప్రీతా సుప్రసన్న వరదా భవతు.

శ్రీ వైభవలక్ష్మి వాయనదానము: (Vaibahava Lakshmi Vayana Danam)

ఇచ్చేవారు : ఇందిరా ప్రతిగృహ్ణాతు
పుచ్చుకునేవారు : ఇందిరావై దదాతిచ
ఇద్దరు : ఇందిరాతారకోభాభ్యా ఇందిరాయై నమోనమః
ఇచ్చేవారు : ఇస్తినమ్మవాయణం
పుచ్చుకునేవారు : పుచ్చుకున్తినమ్మ వాయనం

వాయనమిచ్చినవారు, పుచ్చుకున్నవారికి నమస్కరించాలి.

శ్రీ వైభవలక్ష్మి వ్రత కథ
Story of Vibhava Lakshmi Vrat

పూర్వమొకప్పుడు కైలాసంలో పార్వతీదేవి, పరమేశ్వరుని చూసి, "ఓ ప్రాణ నాథా! భూలోకంలో మానవులందరూ ధనార్జనకోసం ఎడతెరపి లేకుండా శ్రమ పడుతూనే వున్నారు. అయినా వారిలో అతికొద్దిమంది మాత్రమే ఐశ్వర్యవంతులుగా కావడానికి, అత్యధిక సంఖ్యాకులు దరిద్రులుగానే ఉండడానికి కారణమేమిటి?" అని, అడుగగా, సర్వేశ్వరుడు చిరునవ్వు నవ్వి - "దేవీ! సర్వమూ వైభవలక్ష్మిదెవి దయనుబట్టి వుంటుంది. సమస్త సంపదలకూ, ధనధాన్యాదులకు ఆవిడే అధిదేవత, కాబట్టి, ఎవరయితే ఈ సత్యాన్ని గ్రహించి - ఆ వైభవలక్ష్మి యందు, భక్తి కలిగి సదా ఆమెను ఆరాధిస్తుంటారో వైభవలక్ష్మి యొక్క వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారో వారిపట్ల మాత్రమె ఆ తల్లి యొక్క కృపా కటాక్షాలు ప్రసరింపబడుతాయి.

అలా ఆమె దయకు పాత్రులైన వాళ్లు మాత్రమే తమ కృషిలో విజయులై అఖండ వైభవాలనూ సాధించగలుగుతారు. ఎవరైతే ఆమెను తృణీకరించి ఆమె అనుగ్రహాన్ని విస్మరించి, అంతా తమ స్వయం కృషేయని విర్రవీగుతారో, ఎవరైతే శ్రీ వైభవలక్ష్మి స్వరూపమైన ధనాన్ని యీసడించుతారో వాళ్ళు ఏనాటికి ధనవంతులు కాలేరు. వారి కష్టమంతా వృధా అవుతుంది. కాబట్టి, ఎవరైతే ధనవంతులు కావాలనుకుంటున్నారో వాళ్ళు అవశ్యం ఆ వైభవలక్ష్మి వ్రతాన్ని ఆచరించాలి. అప్పుడే ఆమె కరుణకు పాత్రులై అఖండ సిరిసంపదలతో, రాజ వైభోగాలతో తులతూగుతారు." అని చెప్పాడు. అప్పుడు పార్వతీదేవి "ఓ ప్రభూ! ఆ వైభవలక్ష్మి ఎవరు? ఆమె చరిత్ర ఏమిటి? ఆ వ్రత మహాత్యమేమిటి? నాకు పూర్తిగా సెలవివ్వండి." అని వేడగా, ఆ పరమేశ్వరుడు మరల ఈవిధముగా చెప్పసాగాడు. "ఓ దేవీ! అత్యంత పున్యదాయకమైన శ్రీ వైభవలక్ష్మి వ్రతమును చెప్పెదను శ్రద్దగా వినుము" అని ఈ విధముగా చెప్పసాగెను.

పూర్వము ఒకప్పుడు భృగుమహర్షి ఆ పరాశక్తి  కొరకై తపస్సుచేసేను. అందుకు ఆ అమ్మ సంతసించి ఆ మునికి ప్రత్యక్ష్యమయి ఏమి వరము కావాలో కోరుకోమనెను. అప్పుడు భృగుమహర్షి ఆమెకు నమస్కరించి "ఓ తల్లీ ఈ ప్రపంచము మొత్తము మూడు ముఖ్య అవసరములు శక్తి, యుక్తి, భుక్తి అను వాటి పైననే నడుస్తోంది. మహామయయైన నీ శక్తి కళ పార్వతియై పరమేశ్వరునికి అర్ధాంగిగా సేవింపబడుతుంది. నీ విద్యాకళ సరస్వతి యై బ్రహ్మతో మసలుతుంది. ఇక స్థితి కారకమైన నీయొక్క వైభవ కళతో నా కుమార్తెగా జన్మించు" అని కోరెను. ఆ తల్లి అతని కోర్కెను మన్నించెను. తత్ఫలముగానే పరాశక్తి యొక్క సంపత్కళ భృగువుకు వైభవలక్ష్మిగా అవతరించినది. భృగుమహర్షి ఆమెను విష్ణువుకు ఇచ్చి వివాహము జరిపించినాడు. శ్రీ హరి కోరికపై ఆ భార్గవీదేవి దేవతలందరికీ యెనలేని సంపదలను, వైభవాలను సంతరించి స్వర్గలక్ష్మిగా వాసికెక్కింది. కాని ఐశ్వర్య మత్తతతో ఇంద్రుడు చేసిన ఒకానోక దోశమునకుగాను దూర్వాసుడు ఇచ్చిన శాపంకారణంగా - ఆ వైభవలక్ష్మి దూరం అయి పోయినది.

ఇంద్రుడు దరిద్రపీడితుడై విష్ణువును ఆశ్రయించినాడు. భార్యా విరహ తప్తుడైన విష్ణువు కూడా, ఆలోచించి - లక్ష్మిమయమైన క్షీరసాగరాన్ని మధించటం వల్లనే పునః కలుగుతుందని చెప్పాడు. ఆ కారణంగా దేవాసురులు - మందరగిరిని కవ్వంగాను, 'వాసుకి' అనే మహా సర్పాన్ని కవ్వపుత్రాటిగాను అమర్చి - క్షీరసాగరాన్ని మధించగా - వైభవలక్ష్మి ఆ సముద్రంనుంచి ఆవిర్భవించి లోకాలను కరుణించింది. ఆ సమయములో ఇంద్రాది దేవతలు చేసిన ప్రార్ధనలను మన్నించి ఆ తల్లి ఎనమిది మూర్తులుగా భాసించింది. ఆ ఎనిమిది మూర్తులే ఆదిలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, రాజ్యలక్ష్మి, సంతాన లక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధనలక్ష్మి. ఈ ఎనిమిది మూర్తులలో సర్వశ్రేష్టమైనదే ధనలక్ష్మిదేవి. ఆమెనే ఐశ్వర్య లక్ష్మి, వైభవలక్ష్మి అని పిలుస్తారు.

సర్వ ఐశ్వర్య ప్రదాయిని అగు ఈ తల్లి మహాభిమాని, ఆమెయందు కొంచెము కూడా అపచారము జరిగిన మన్నించదు. అందుకు ఉదాహరణ చెబుతాను విను, పూర్వం త్రిమూర్తులలో ఎవరు సాత్వికులో పరీక్షించేందుకు ఋషులు అందరు కలిసి లక్ష్మిదేవి తండ్రి అయిన భృగువును నిర్దేశించినారు. తత్కారణంగా ముందుగా సత్యలోకానికి వెళ్లిన భృగువుకు, అక్కడ అవమానము ఎదురౌతుంది. తనరాకను పట్టించుకోనందుకు ఆ మహర్షి బ్రహ్మ దేవుని శపించి కైలాసానికి వెళ్ళాడు. అక్కడ కూడా పార్వతీ పరమేశ్వరులు అతని రాకను గమనించకుండా ఏమీ ఎరుగానివారి వలే సరస సల్లాపములలో మునిగి వుండిరి, అది చూసిన భృగువు పట్టరానికోపముతో అక్కడనుండి వైకుంఠమునకు చేరాడు. ఇక్కడ లక్ష్మీ నారాయణులు ఇద్దరూ పాచికలాటలో ఉండి పోయి భృగువును గమనించలేదు. అందుకు ఆ మహర్షి పట్టరానికోపముతో విష్ణువుయొక్క వక్షస్థలము పైన తన్నాడు. అయినా విష్ణువు కోపించకుండా అతి శాంతముగా ఆ మహర్షిని ఆరాధించి, శాంతపరచి పంపివేశాడు. కాని అందు నిమిత్తమై ఆ లక్ష్మీ దేవి అలిగినది. తన నివాస స్థానమైన విష్ణు వక్ష స్థలాన్ని తన్నిన భృగువును శిక్షించకుండా వదిలిన శ్రీహరిమీద కూడా అలిగి వైకుంఠాన్ని వదిలిపెట్టి వెళ్ళింది. ఆ విధంగా వైకుంఠమును వదిలి భక్తులమీద ప్రేమతో భూలోకమునకు విచ్చేసి కొల్హాపురము నందు ఉండెను.

ఓ ప్రార్వతీ! భక్త సులభ, అత్యంత కరుణామయి అయిన ఆ తల్లి లీలలు ఎన్ని చెప్పినా తనివి తీరవు. ఉదాహరణకు ఒక కథ చెబుతాను వినుము.

చాలాకాలం క్రితం ప్రతిష్టానపురంలో శీల, సుశీల, గుణశీల, విశాల అనే నలుగురు అక్కా చెల్లెళ్ళు వుండేవారు. శ్రీ వైభవలక్ష్మి భక్తులైన ఆ నలుగురు కన్యలకు ఉన్న ఊరిలోనే ఉన్నత వంశ సంజాతులైన నలుగురు యువకులతో వివాహాలు జరిగినవి. ఆ పిల్లల అదృష్టవశాత్తు వారి భర్తలు నలుగురు వివిధ వృత్తులద్వారా చక్కని సంపాదనలు కలిగి ఆస్తిపరులై ఆరోగ్యవంతులై విరాజిల్లేవారు. కాని, రానురాను వారిలో అహంకారము తలెత్తింది. దైవచింతన తగ్గింది, శ్రీ వైభవలక్ష్మి దేవి అనుగ్రహం వలననే అన్న విషయాన్ని విస్మరించి అంతా తమ ప్రయోజకత్వమే అనుకున్నారు.

మహాపండితుడైన శీల భర్తకు తన పాండిత్యం వలననే ప్రపంచం తనని గౌరవిస్తోందనే భావన కలిగింది. "ఇందులో వైభవలక్ష్మి దయ ఏముంది" నానోట్లో విద్య ఉంది, ఎంత గోప్ప వాళ్ళయినా నాకు డబ్బులిచ్చి సన్మానించక ఏం చేస్తారు? అని భావించాడు. ఎంతటి ధనవంతులైన తన విద్య ముందు బలాదూర్ అనుకున్నాడు. అందుకు ఆ వైభవలక్ష్మి దేవి కోపగించి అతనికి తగిన గుణపాఠం చెప్పదలచింది. అంతటితో అతని సంపాదన పూర్తిగా పోయింది. అతని పాండిత్యానికి విలువలేకుండా పోయింది. సంపాదించిన ధనం అంతయు ఖర్చు అయిపొయింది. చివరకు కట్టుబట్టలతో మిగిలాడు. అతని దారిద్య్రమును చూసి సమాజం అతనిని దూరంగా నెట్టింది. అతని కుటుంబం మొత్తం ఆకలిదప్పులతో అలమటించసాగారు.

రాజాస్థానంలో ఉపదళాధిపతిగా వుండే సుశీల భర్త, ఒకానొక యుద్దంలో అపూర్వ విజయం సాధించి రాజు చేత గౌరవించబడి, అహంకారముతో తనబలం ముందు ప్రపంచమంతయు దాసోహమే అని విర్రవీగాడు. తన ధనార్జనకి తన బలమే కారణం అని భ్రమించాడు. అందుకు ధన లక్ష్మి ప్రమేయము ఏమీ లేదు అని అనుకున్నాడు. అందుకు ఆ అమ్మవారు ఆగ్రహించింది. అంతటితో అతడిలో సద్బుద్ధి నశించింది. అనుకోని వైరముతో ఒక గొప్ప ధనవంతుడితో గొడవకు దిగుతాడు. అతనిని తను అడిగిన ధనము ఇవ్వకపోతే నాశనం చేస్తానన్నాడు. అందుకు భయపడిన ఆ ధనవంతుడు మహారాజుని ఆశ్రయించి సుశీల భర్త మీద మరిన్ని లేనిపోని విషయాలు కూడా నూరిపోసి, తనను కాపాడమని రాజుని వేడుకుంటాడు. వెంటనే రాజు తన సేనల్ని పంపి సుశీల భర్తను బంధించి తెమ్మంటాడు. ఆ రాజభటులు అతడిని బంధించి రాజు ముందు నిలిపారు. న్యాయస్థానములో రాజు అతడిని విచారించి అతని ఆస్తిపాస్తులన్నింటిని స్వాధీనం చేసుకొని అతడిని చెరసాలలో బంధించాడు. ఈ విధంగా సుశీల కాపురం కష్టాల పాలైంది.

వ్యాపారస్తుడైన గుణశీల భర్త దైవానుగ్రహముకన్న తన తెలివితేటలే వ్యాపారములో ముఖ్యమని తన పెట్టుబడితో, మాటకారితనంతో మాత్రమే సంపాదించగలిగాను. అంతేగాని సంపాదించిన దంతా దైవానుగ్రహమువలననే అనుకోవడం మూర్ఖత్వమని భావించాడు. అతను దైవారాధనలు అన్నియు మానివేశాడు. అతని తలపొగరు వలన సాటి వ్యాపారులు అతడికి సహకరించడము మానివేశారు. అతని వ్యాపార లావాదేవీలు సన్నగిల్లి అతడి రాబడి తగ్గి,  అతని కుటుంబము దారిద్య్రములో మునుగుతుంది.

ఇక చివరిదైన విశాల భర్త మంచివాడే గాని, అధిక సంపాదన వలన చెడు స్నేహాలు పెరిగాయి. కష్టపడి సంపాదించిన దానితో సుఖపడాలే గాని పూజలు వ్రతాలు అంటూ వృధా ఖర్చు చేయడము దేనికి అనుకున్నాడు. అందువల్ల చెడుమిత్రులవల్ల దుర్వ్యసనాల పాలయ్యాడు. మద్యపానం, వ్యభిచారం, జూదం మొదలగు చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. ఆ కారణం చేత అతని సంపాదనంతా హారతి కర్పూరంవలె కరిగిపోయింది. చివరకు అతడు దరిద్రుడై పోయాడు. ఋణదాతల పీడా, పేదరికపు బాధ, వదులుకోలేని వ్యసనాలతో అతడు దుర్మార్గుడిగా మారతాడు. తరచూ విశాలను హింసిస్తూ ఉండేవాడు.

అయినా ఆ నలుగురు అక్క చెల్లెళ్ళు మాత్రం ఎదో ఒక నాటికి ఆ జగన్మాత అయిన శ్రీ వైభవలక్ష్మి దేవి తమను అనుగ్రహిస్తుందని తమ భర్తలను మంచి దారిలో పెట్టి తమకు పూర్వ వైభవమును కలిగిస్తుందని నమ్మేవారు. తాము పస్తులు వుండినా ఫర్వాలేదు. తమ బిడ్డలకయినా రవ్వంత ఆహారాన్ని ప్రసాదించమని పదే పదే ఆ లక్ష్మీ దేవిని ప్రార్ధించేవారు. అందుకు ఆ అమ్మవారికి వారిపై దయగలుగుతుంది. ఒకనాడు ఆ నలుగురు సోదరీమణులు కలిసి తనను ప్రార్ధిస్తున్న శుభ సందర్భములో ఆ వైభవలక్ష్మి దేవి ఒక వృద్ద స్త్రీ రూపంలో వచ్చి వారిని పలుకరించి ఇలా చెప్పసాగింది.

పిల్లలూ! మీ భక్తి ప్రపత్తులను చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఏ వైభవలక్ష్మి అనుగ్రహానికి మీరింత విపరీతంగా ఆవేదన పడుతున్నారో ఆ వైభవలక్ష్మి ప్రసాదం అతిత్వరితంగా సిద్ధించే మార్గం చెబుతాను, తక్షణమే మీ అక్కాచెల్లెళ్లు నలుగురూ మీ మీ ఇళ్ళల్లో శ్రీ వైభవలక్ష్మి వ్రతం చెయ్యండి.

అవ్వ చెప్పిందంతా విన్న అక్కాచెల్లెళ్లు, అత్యంత సంతుష్ట హృదయులై ఓ అవ్వా ఇంతకూ ఈ వ్రతాన్ని ఏవిధంగా చెయ్యాలి. ప్రస్తుతము మేము దారిద్య్రములో వున్నాముగదా! ఆ వ్రతానికి యెంత ఖర్చు అవుతుంది? అని ప్రశ్నించారు. అందుకా వృద్ద మాత చిరు మందహాసం చేస్తూ ఇలా చెప్పింది.

ఓ అమ్మాయిలూ! ఇదేమి ఖర్చుతో కూడిన పనికాదు. ఎప్పుడైనా సరే నాలుగు లేక ఆరు లేక ఎనమిది అంతకు మించి పదకొండు లేదా ఇరవై ఒక్క గురువారములుగాని, శుక్రవారములుగాని ఆచరించాలి. ఈ వ్రతాన్ని గురువారాలు చేసే వాళ్ళు, తాము మొక్కుకున్న వారాలు చేసి ఆఖరి గురువారమునాటి మరునాడు వచ్చే శుక్రవారమునాడు ఉద్యాపన చేయాలి. శుక్రవారములు చేసుకొనే వారు ఆఖరి శుక్రవారమునాడే ఉద్యాపన చేసుకోవాలి.

ముందుగా మీకు తోచిన గురువారము లేదా శుక్రవారమునాడు గాని ఉదయమే లేచి కాలకృత్యములు తీర్చుకొని ఇంటిని అలంకరించుకొని తలంటుపోసుకొని "అమ్మ వైభవలక్ష్మి దేవి ఈ రోజు మొదలు ఇన్ని గురువారములు లేదా శుక్రవారములు నీ వ్రతాన్ని ఆచరిస్తాను, నాకు తగిన శక్తిని ప్రసాదించు, నేను చేసే ఈ వ్రతంతో సంతృప్తురాలవై నా కోరికలను నెరవేర్చు" అని మ్రొక్కుకోవాలి. ఆ రోజంతా ఉపవాసముండి ఆ సాయంత్రం సూర్యాస్తమయం తరువాత పూజ ప్రారంభించాలి. ఈ వ్రతానికి ఖర్చు కన్నా శుచీ శుభ్రతలు సదాచార పాలనము ముఖ్యము.

ఏ ఇంటిలో వారయితే అతిధి అభాగ్యతులకు దాసులవలే ఉండి, వారి పాదములను కడిగి, ఆ తీర్ధం శిరస్సున చల్లుకొని, తమకన్నా ముందుగా వారి భోజనాదులు ఏర్పరచి, సేవాదులు చేస్తుంటారో, ఏ ఇంట ధాన్యం దానం జరుగుతుందో, ఏ ఇంట పితృదేవతలు, దేవతలు సదా పూజింపబడుతారో, ఏ ఇంటి వారు పరులపట్ల శత్రుభావం లేకుండా ఉంటారో, ఏ ఇంటి ఇల్లాలు నిరాడంబరియై, నిత్య సంతోషిగా వుంటుందో ఆ ఇంటిలో శ్రీ వైభవలక్ష్మి దేవి స్థిరంగా వుంటుంది.

వైభవలక్ష్మి పూజా విధానము:
Vibhav Lakshmi Pooja Vidhanam

పూజ ప్రారంభించవలసిన సాయంత్రం సూర్యాస్తమయం తరువాత తూర్పు లేదా ఈశాన్య గదిలో శుభ్రంగా అలికి పంచావర్నములతో గాని లేదా బియ్యపుపిండితో గాని అష్టదల పద్మాలు మొదలైన ముగ్గులను బెట్టి దాని మీద నూతన వస్త్రం చతురస్రంగా పరచి, ఆ వస్త్రం మీద తగినన్ని బియ్యం పోసి, దానిమీద బంగారు, వెండి, రాగి చెంబును కలశంగా అమర్చి అందులో నాలుగు వైపులా నాలుగు తమలపాకులు లేదా మామిడి ఆకులుగాని వుంచి వాటిమీద కొబ్బరికాయను, దానిమీద ఒక రవికలగుడ్డను పెట్టి, ఆ మీదుట ఒక యెర్రని పువ్వును పాత్రలో వుంచి, అందులో ఒక బంగారు/వెండి నగను ఉంచాలి. అందుకు కూడా శక్తి లేని వాళ్ళు ఆ సమయానికి చలామణిలో వున్న నాణెమును ఉంచాలి. నేతితో దీపాన్ని వెలిగించి, అగరువత్తులతో ధూపం వెయ్యాలి.

అమ్మాయిలూ! అమ్మవారికి లక్ష్మిగణపతి అన్నా శ్రీ చక్రమన్నా చాలా ఇష్టము. కాబట్టి, ముందుగా లక్ష్మిగణపతిని , శ్రీ చక్రాన్ని పూజించి, అనంతరమే వైభవలక్ష్మిని అర్చించాలి. పూజలో తీపి పదార్ధాన్ని నివేదన చెయ్యాలి. ఈ పూజలో వెండి బంగారం లేని పక్షంలో పసుపుకోమ్ములను వుంచి పూజించాలి. ఈ పూజలో తీపి పదార్ధము చెయ్యలేనివారు బెల్లం పటికబెల్లం, పంచదార అయినా నివేదించవచ్చు. ఏదైనా నలుగురికి పంచగలగాలి. పూజానంతరము బంగారు, వెండి నాణాన్ని భద్రపరచాలి. కలశంలో నీళ్ళను సంతానాన్ని కోరుకొనేవారు మామిడిచెట్టు మొదట్లోను, సౌభాగ్యాన్ని కోరుకొనేవారు తులసి చెట్టు మొదలులోను, అనుకూల దాంపత్యాన్ని కోరుకొనేవారు మల్లె మొదలైన పువ్వుల చెట్ల మొదట పూయాలి. కేవలం ధనాకాంక్షులైన వారు ఆ నీటిని తాము మాత్రమే స్వీకరించాలి. మండపం మీది బియ్యాన్ని పక్షులకు వెయ్యాలి. ఇలా వ్రతాన్ని ఆచరించడము ద్వారా నిరుద్యోగులు వుద్యోగవంతులవుతారు, అవివాహితులకు వివాహము జరుగుతుంది, దరిద్రులు ధనవంతులవుతారు. ఏయే కోరికలుంటే ఆయా కోరికలు నెరవేరుతాయి. అని ముగించిందా వృద్ద మాత.

తక్షణమే ఆ అక్కాచెల్లెళ్లు నలుగురూ వారి వారి తాహతును బట్టి 4, 8, 11, 21 వారములపాటు ఆ వ్రతాన్ని మొక్కుకున్నారు. మరుసటి శుక్రవారమే వ్రతం ఆరంభించారు. నలుగురు కడుపేద వాళ్ళయి ఉండటము చేత నలుగురు కూడా రాగి కలశమును వాడారు. అందరికన్నా అధిక దరిద్రురాలైన శీల కలశంలో రాగి నాణాన్ని వుంచి పూజించింది. సుశీల రూపాయి నానాన్నే వుంచి పూజించింది. గుణశీల తన ఇంట వున్న వెండి నాణాన్ని వుంచి పూజించింది. చివరిది అయిన విశాల తన ముక్కేరను వుంచి ధనలక్ష్మిగా ఆరాధించింది. ఎవరు ఏయే రూపాలలో ఆరాధించిననూ వారి హృదయంలో గల భక్తి భావాలనే ప్రధానంగా స్వీకరించే తల్లి ఆ వైభవలక్ష్మి దేవి.

వారు వ్రతము ప్రారంభించిన అతికొద్ది సమయములోనే శీల భర్త యొక్క పాండిత్యము ప్రాచుర్యము పొంది అందరిచే గౌరవించబడి, తిరిగి అతనికి సంఘంలో గౌరవ మర్యాదలు లభించాయి. తద్వారా వారు వున్నతులయ్యారు. సుశీల ఆచరించిన వ్రత ఫలితముగా వారి రాజ్యానికొక యుద్ధం ఏర్పడింది. ఆ యుద్ద నిమిత్తం అంతకు పూర్వమే లబ్ధ ప్రతిష్టుడైన, సుశీల భర్తను విడుదల చేసి, అతనినే దళపతిగా అభిషేకించి యుద్దానికి పంపక తప్పలేదు. ఆ యుద్దంలో అమ్మవారి దయ వలన సుశీల భర్త విజయం సాధించడంతో అతనిని గత నేరాలన్నీ మన్నింపబడి, దళపతిగా స్థిరపడ్డాడు. అంతటితో సుశీల కుటుంబం బాగుపడింది.

అకస్మికంగా ఏర్పడిన వ్యాపార మార్పులవలన కొన్ని ప్రత్యేకమైన దినుసుల ఎగుమతి దిగుమతి విషయములో గుణశీల భర్త వెలుగులోకి వచ్చాడు. ఇతర వ్యాపారస్తులందరూ అతనినే ఆశ్రయించారు. సహజంగానే తెలివిగల గుణశీల భర్త ఆ అవకాశాన్ని వినియోగించుకున్నాడు. తద్వారా వారి కుటుంబము పూర్వ వైభవాన్ని పొందింది.

ఇక చివరిదైన విశాల వ్రతారంభం చేయగానే అమ్మవారి దయవలన ఆమె భర్త క్రమముగా చెడు వ్యసనములన్నింటినీ ఒకదాని తరువాత ఒకటిగా వదిలి వేసినాడు. తన కుటుంబము పట్ల ఎంతో శ్రద్ధ కనబరచినాడు. వారి కుటుంబము కూడా పూర్వము వలే సుఖ సంతోషములతో జీవించసాగింది.

కాబట్టి స్త్రీలుగాని, పురుషులుగాని, ఆబాలగోపాలమెవరు తనను పూజించినా సరే, తక్షణమే ఆ అమ్మ కరుణించి వారి కోర్కెలను నెరవేర్చును.

శ్రీ వైభవ లక్ష్మి వ్రత కథ సమాప్తం.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.